Liger: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. 'లైగర్' సినిమా ఓ బాక్సర్ కథగా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. 'లైగర్'తో విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సౌత్‌లో 'లైగర్' సినిమా హక్కులు రికార్డు రేటుకు అమ్ముడుపోయాయి.
'లైగర్'కు సినీ ప్రముఖుల మద్దతు
'లైగర్' సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల హక్కులు రూ. 70 కోట్లకు అమ్ముడయ్యాయట. చిత్ర యూనిట్ మాత్రం రూ. 100 నుండి 170 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవలే 'లైగర్' సినిమా కోసం విజయ్ దేవరకొండ బోల్డ్‌గా దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
పూరీ జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను ఆకాశానికి ఎత్తేశారు. విజయ్ సినిమా కోసం చేసిన సాహసం అంటూ పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఆ తర్వాత రిలీజ్ అయిన 'లైగర్' ట్రైలర్ సినిమా బిజినెస్ ట్రాక్‌ను మార్చేసింది..'లైగర్' సినిమా ఓ రేంజ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా హక్కులకు భారీగా డిమాండ్ పెరిగింది.
గురువు పాత్రలో రోనిత్ రాయ్
బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ 'లైగర్'కి మాస్టర్‌గా నటిస్తున్నారంటూ అదే వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ప్రతిభను ప్రొత్సహించే వారే నిజమైన గురువు' అంటూ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ, రోనిత్ రాయ్‌ల మధ్య జరిగే సీన్లు ఈ సినిమాలో హైలెట్ కానున్నాయట.
భారీ బడ్జెట్ సినిమా 'లైగర్'
'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మైక్ టైసన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాను రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హీరోయిన్ ఛార్మి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read More: Liger : 'లైగర్' ట్రైనింగ్ మాస్టర్ వీడియో రిలీజ్!.. గురువు పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు
Follow Us