టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) "లీడర్" చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి, బాహుబలి లాంటి చిత్రాలు ఆయనలోని మంచి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
ఇటీవలే రానా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేడు ఇండియన్ సినిమాలో భాషాపరమైన భేదాలు తగ్గుముఖం పట్టి, అన్ని సినిమాలను అందరూ ఆదరిస్తున్న క్రమంలో రానా పరిశ్రమకు ఓ సలహా ఇచ్చారు.
‘కబ్జా’ మూవీ ట్రైలర్‌ని ఆవిష్కరించిన రానా
"దక్షిణాది సినిమాలను కనీసం నాలుగు భాషలలో విడుదల చేస్తే, మంచి ప్రయోజనం ఉంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపేంద్ర హీరోగా నటించిన ‘కబ్జా’ (Kabzaa) మూవీ ట్రైలర్‌ను బెంగళూరులో ఆవిష్కరించిన రానా దగ్గుబాటి, ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కమర్షియల్ సినిమాలతో పాటు సమాంతర, ఆర్ట్ సినిమాలను కూడా నిర్మిస్తూ, కన్నడ పరిశ్రమ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందిందని రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు.
ఇటీవలే రానా దగ్గుబాటి (Rana Daggubati) "విరాటపర్వం" చిత్రంలో నటించారు. సాయిపల్లవి ఈ చిత్రంలో కథానాయిక. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్‌లో సాగిన ఈ చిత్రం యావరేజి టాక్‌ను సొంతం చేసుకుంది.
"రానా నాయుడు"లో రానా దగ్గుబాటి
మంచి సినిమాలకు రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తుంటారు. కేరాఫ్ కంచరపాలెం, 777 చార్లి, గార్గి లాంటి సినిమాలను ఆయన ప్రజెంట్ చేశారు. ప్రస్తుతం రానా, తన బాబాయి వెంకటేష్‌తో కలిసి "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
అలాగే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 1 చిత్రం తెలుగు వెర్షన్‌కి వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నారు రానా.
Read More: 777 చార్లి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న రానా దగ్గుబాటి
Follow Us