ఆ మధ్యకాలంలో 'సన్నాఫ్ ఆఫ్ ఇండియా' (Son of India) పేరుతో ఒక కొత్త సినిమాని డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu). అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత ప్రభావం ఏమీ చూపించలేదు. పైగా సమీక్షలు కూడా ప్రతికూలంగా వచ్చాయి.
'సన్నాఫ్ ఇండియా' సినిమా మోహన్ బాబుకి చాలా నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా పాత్రధారుల మొహాలు చూపించకుండా, సగం సినిమాని నడిపే ఐడియా అంతగా వర్కవుట్ కాలేదు. ఏదైతేనేం, కొంత సమయం వేచి చూశాక, ఇటీవలే తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న (Lakshmi Prasanna) నిర్మాతగా ఓ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు మోహన్ బాబు.
టైటిల్ లుక్ విడుదల
ఈ కొత్త సినిమా పేరు 'అగ్ని నక్షత్రం' (Agninakshatram) అని చెబుతూ.. ఈ రోజే టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మోహన్ బాబు తన కుమార్తె లక్ష్మీ ప్రసన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. పైగా ఈ తండ్రీ, కూతుళ్లు ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం
వైవిధ్యమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
అంతే కాదు.. మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న కలిసి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా టేకప్ చేస్తున్నారట. ఈ సినిమాపై వారికి భారీ అంచనాలే ఉన్నాయట. ఈ సినిమా టైటిల్ వీడియోలో పోలీస్ వాహనం చీకట్లో వెళ్తూ కనిపిస్తుంది. పైగా సైరన్ మోగిస్తూ వెళ్లే విజువల్స్‌కి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా ఉంది.
ప్రతీక్ ప్రజోష్ (Prateek Prajosh) ఈ సినిమాకి డైరెక్టర్. క్రైం డ్రామా సబ్జెక్టుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు జోషి తెలిపారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ , మంచు ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి లిజో కే జోష్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Read More: ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాలో పాట పాడిన కూతుళ్లు అరియానా, వివియానా
Follow Us