ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్న వాళ్లకు మాత్రమే హీరోయిన్లుగా అవకాశాలు వస్తాయని అంటారు. అలా వచ్చిన అవకాశాలను వినియోగించుకుని కొందరు టాప్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అదృష్టం కలిసిరాక కొందరు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతే మరికొందరు వివిధ కారణాలతో వెండితెరకు దూరమవుతారు.
మొదటి సినిమాలో తమ నటనకు మంచి మార్కులే పడినా, సినిమా హిట్ అయినా సరైన బ్రేక్ రాకపోవడంతో లేదా ఇతర కారణాలతో టాలీవుడ్‌కు దూరమైన టాప్10 హీరోయిన్ల వివరాలు పింక్‌విల్లా వ్యూయర్స్ కోసం..
రిచా పల్లోడ్ :
చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటనను ప్రారంభించిన రిచా పల్లోడ్.. తరుణ్ (Tarun) హీరోగా నటించిన నువ్వేకావాలి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఈ అమ్మడికి వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని అనుకున్నారు అందరూ. అయితే అనుకున్న స్థాయిలో చాన్స్‌లు రాలేదు.
ఉదయ్‌కిరణ్ (Uday Kiran) హీరోగా వచ్చిన హోలి, తరుణ్ సరసన చిరుజల్లు సినిమాల్లో నటించినా రిచాకు హిట్ దక్కలేదు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలు చేస్తూ అడపాదడపా టాలీవుడ్‌లో కనిపించినా బిజీ హీరోయిన్ కాలేదు.
అన్షు అంబానీ :
అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా వచ్చిన ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైనర్ మన్మథుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు అన్షు. ఈ సినిమాలోని క్యూట్ లుక్స్‌కు యూత్ ఫిదా అయిపోయారు.
తరువాత ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్న అన్షు పెళ్లి చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉన్నారు.
అనురాధా మెహతా :
అల్లు అర్జున్ (Allu Arjun)ను హీరోగా నిలబెట్టిన సినిమా ఆర్య. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఆ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు అనురాధా మెహతా. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో హీరోయిన్ నటన కూడా ఒక కారణం.
ఆర్య సినిమా తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ‘నువ్వంటే నాకిష్టం’ సినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో కనిపించారు అనురాధా మెహతా. అనంతరం సినిమాల నుంచి పూర్తిగా దూరమయ్యారు.
నేహా బేంబ్ :
నితిన్ (Nithin) హీరోగా తెరకెక్కిన దిల్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ నేహా బేంబ్. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో నేహాకి కూడా మంచిపేరు వచ్చింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన అతడే ఒక సైన్యం సినిమాలో హీరోయిన్‌గా నటించారు.
అనంతరం శివబాలాజీతో దోస్త్, బొమ్మరిల్లు, రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కిన దుబాయ్ శీను సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారు.
భాను శ్రీ మెహ్రా :
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా వరుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు భాను శ్రీ మెహ్రా. సినిమా విడుదలయ్యే వరకు పోస్టర్లు, ప్రమోషన్స్‌లో కూడా కనిపించకుండా హైప్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.
అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తర్వాత భాను శ్రీ మెహ్రా ఎక్కడా కనిపించలేదు.
గౌరీ ముంజాల్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా బన్నీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు గౌరీ ముంజాల్. బన్నీ..బన్నీ..బన్నీ..బన్నీ అంటూ స్టెప్స్ వేసి కుర్రకారుతో థియేటర్లలో విజిల్స్ వేయించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
బన్నీ తర్వాత టాలీవుడ్‌లో మూడు నాలుగు సినిమాల్లో గౌరీ ముంజాల్ నటించినా పెద్దగా పేరు రాలేదు. దీంతో ఆమె కూడా వెండితెరకు దూరమయ్యారు.
మీరా చోప్రా :
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన బంగారం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మీరా చోప్రా. ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. దీంతో రెండు సంవత్సరాల వరకు తెలుగులో సినిమా చేయలేదు మీరా చోప్రా. అనంతరం ఎంఎస్ రాజు దర్శకత్వం వహించి, నిర్మించిన వాన సినిమాలో హీరోయిన్‌గా నటించారు.
మరో మూడు సంవత్సరాల తర్వాత రెండు సినిమాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో ప్రేక్షకులకు దూరమయ్యారు.
సారా – జానె దియాస్ :
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన సినిమా పంజా సినిమాలో హీరోయిన్‌గా నటించారు సారా – జానె దియాస్. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిన సారా.. తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు.
అయితే తమిళం, హిందీ సినిమాల్లో అక్కడక్కడా కనిపిస్తూ సందడి చేశారు. 2017లో వైస్రాయ్ హౌస్ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించారు సారా – జానె దియాస్.
పాయల్ ఘోష్ :
మంచు మనోజ్(Manoj Manchu) హీరోగా తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ప్రయాణం. ఈ సినిమాలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు పాయల్ ఘోష్. తన అమాయకమైన లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఊసరవెల్లితోపాటు మరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన పాయల్ ఘోష్.. సినీ ప్రయాణాన్ని ఆపేశారు.
బేబీ షామిలి :
సిద్దార్ధ్ (Siddharth) హీరోగా నటించిన ఫీల్ గుడ్ మూవీ ‘ఓయ్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు బేబి షామిలి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న షామిలి.. ఓయ్ సినిమాలో నటనకు మంచి మార్కులు వేయించుకున్నారు.
ఈ సినిమా విడుదలైన దాదాపు 9 సంవత్సరాల తర్వాత ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో చేశారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.
Follow Us