Sita Ramam: 'సీతారామం' చూడ చ‌క్క‌ని ప్రేమ కావ్యం.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలి - చిరంజీవి (Chiranjeevi)

Sita Ramam: 'సీతారామం' సినిమా చూసిన చిరంజీవి  (Chiranjeevi)   సోష‌ల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ను ప్ర‌శంసించారు.

Sita Ramam: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'సీతారామం' సినిమాపై ప్ర‌శంస‌లు కురింపిచారు. 'సీతారామం' సినిమా త‌న‌కు ఎంతో న‌చ్చిన సినిమా అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు చిరు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో విడుద‌లైన 'సీతారామం' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా 'సీతారామం' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 

చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చిరు

దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా న‌టించిన 'సీతారామం' (Sita Ramam) సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ’అందాల రాక్ష‌సి’ ఫేం హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా విడుద‌లైంది. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన చిరంజీవి  (Chiranjeevi)   సోష‌ల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌ను ప్ర‌శంసించారు. 'సీతారామం' సినిమా చూడ చ‌క్క‌ని ప్రేమ‌కావ్యమ‌ని చిరు తెలిపారు. ఈ సినిమాను విభిన్న‌మైన క‌థ‌తో తెర‌కెక్కించ‌డం మొచ్చుకోద‌గిన అంశ‌మ‌న్నారు. 
 

సినిమా చూసిన వారి మ‌న‌సుల‌పై 'సీతారామం' సినిమా చెర‌గ‌ని ముద్ర వేసింది. ఈ చిత్రం తెర‌కెక్కించిన నిర్మ‌త‌లు అశ్వినిదత్, స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు హను రాఘవపూడికి చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌, ర‌ష్మిక మంద‌న్నల‌తో పాటు సంగీత ద‌ర్శ‌కుడు విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌ను చిరు మెచ్చుకున్నారు. 

జాతీయ స్థాయిలో అవార్డులు

'సీతారామం' సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని చిరంజీవి ప్ర‌శంసించారు. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచిన సినిమా 'సీతారామం' ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించాలని చిరు కోరుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాల‌ని చిరంజీవి ఆకాంక్షించారు.

Read More: చూడ చ‌క్క‌ని దృశ్య కావ్యం 'సీతారామం' (Sita Ramam) - మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

Credits: Twitter
You May Also Like These