'మేజర్' (Major) సినిమా సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది. ముంబై దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 'మేజర్' సినిమా తెరకెక్కింది. 'మేజర్' పాత్రలో నటించిన అడవి శేష్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. 'మేజర్' పాత్రలో అడవి శేష్ జీవించారంటూ విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ప్రస్తుతం 'మేజర్' చిత్రం బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీ రికార్డులను కూడా తిరగరాస్తోంది.
టాప్‌లో మేజర్ (Major)
హీరో అఢవిశేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క కాంబినేషనులో 'మేజర్' చిత్రం జూన్ 3 తేదిన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన 'మేజర్' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాలలో దక్షిణాసియాలో 'మేజర్' మొదటి స్థానంలో నిలిచింది. ఇక వరల్డ్ వైడ్‌గా 8వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇటీవలే తమ ఓటీటీలో ప్రదర్శితమవుతున్న టాప్ 10 ట్రెండింగ్ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో 'మేజర్' కూడా ఉంది. ఈ సినిమా 14 దేశాల్లో టాప్ 10లో కొనసాగుతూ, కొత్త రికార్డులను తిరగరాస్తోంది.
'మేజర్' చిత్రాన్ని హీరో మహేష్ బాబు నిర్మించారు. ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివి శేష్ (Adivi Sesh) కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు.
టాప్ 1లో మేజర్
ఇండియాతో పాటు శత్రు దేశమైన పాకిస్థాన్‌లోనూ 'మేజర్' (Major) రికార్డులు సృష్టిస్తోంది. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమా దుమ్మురేపింది. 'మేజర్' సినిమాను పాకిస్తాన్ ప్రేక్షకులే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించారు. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా, ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించారు. ఇండియాతో పాటు ఈ మూడు దేశాల్లో 'మేజర్' సినిమా ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది.
Follow Us