'పటాస్' సినిమాతో టాలీవుడ్లో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆ సినిమా కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యింది. అదే జోష్‌తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈయన ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది.
సుమారు రెండు సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా 'ఎఫ్ 2' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేసింది.
'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్‌గా అదే తారాగణంతో 'ఎఫ్ 3' సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవలే రిలీజైన 'ఎఫ్ 3' కూడా సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన కొద్దిరోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇక, అసలు విషయానికి వస్తే, ఎఫ్3 షూటింగ్ సమయంలో హీరోయిన్ తమన్నాకు, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు బాగానే వినిపించాయి.
అందుకే సినిమా ప్రమోషన్స్‌కు కూడా తమన్నా రాలేదని చాలా మంది అనుకున్నారు. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తమన్నాతో జరిగిన గొడవల విషయంపై అనిల్ స్పందించాడు.
గొడవ లాంటిదేం లేదు..కానీ
'ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేస్తునప్పుడు చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. తమన్నాతో జరిగింది పెద్ద గొడవేం కాదు. ఒకరోజు రాత్రి షూటింగ్ సమయాన్ని కొంత పొడిగించాల్సి వచ్చింది. దానికి ఆమె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి. టైం లేదు. వెళ్లిపోవాలి' అని మాట్లాడింది.
రెండురోజులు మా మధ్య వాతావరణం కొంత వేడిగా ఉంది. ఆ తర్వాత మామూలే. ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం. వేరే సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల తమన్నా ప్రమోషన్స్‌కు రాలేకపోయింది' అని అనిల్ చెప్పాడు. కొంత సమయం తీసుకున్నా 'ఎఫ్ 4' సినిమా చేస్తానన్నాడు అనిల్ రావిపూడి. మే 27న రిలీజైన ఎఫ్3 సినిమా 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
Read More: సినిమాలో కమెడియన్స్ లేకున్నా పర్వాలేదు.. కానీ కామెడీ ఉండాలి : బ్రహ్మానందం
Follow Us