Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన 'విక్రమ్' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. కమల్ హాసన్‌ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ 'విక్రమ్'లో సరి కొత్త పాత్రలో చూపించారు. రా ఏజెంట్‌గా కమల్ హాస్ 'విక్రమ్'లో తన నట విశ్వ రూపాన్ని చూపించి.. బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు. డగ్స్‌పై పోరాటం చేసే రా ఏజెంట్ పాత్రలో నటించి.. కమల్ హాసన్ ఓ మెసేజ్ కూడా ప్రేక్షకులకు అందించారు. డ్రగ్స్ మాఫియా వ్యవస్థను అంతం చేసేందుకు 'విక్రమ్' చేసిన పోరాటం థియేటర్లలో దద్దరిల్లింది. ప్రస్తుతం ఓటీటీలో 'విక్రమ్' దూసుకుపోతోంది.
కమల్‌తో పాటు మరో ముగ్గురు హీరోలు
కమల్ హాసన్ (Kamal Haasan) పాత్రను 'విక్రమ్'లో చాలా చక్కగా తీర్చిదిద్దారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అంతేకాదు 'విక్రమ్' సినిమాలో తమిళ స్టార్ హీరోలను డిఫరెంట్ క్యారెక్టర్లలో అద్భుతంగా చూపించాడు. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి జీవించారు. ఇక రోలక్స్ సర్ పాత్రలో సూర్య చేసిన నటన ఓ రేంజ్‌లో ప్రేక్షకులకు వినోదం పంచింది. సూర్య కేవలం 5 నిమిషాలే ఈ సినిమాలో కనిపించినా.. రోలెక్స్‌గా ఇరగదీశారు. మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ నటన కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
కలెక్షన్ల సునామీ సృష్టించిన విక్రమ్
'విక్రమ్' ఇండియన్ బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేసింది. తమిళనాడులో 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసి కలెక్షన్లలో రెండో స్థానానికి చేరింది. వసూళ్ల పరంగా తమిళ్ సినిమాల్లో మొదటి స్థానంలో రజనీకాంత్ నటించిన '2.0' ఉండగా.. రెండో స్థానంలో 'విక్రమ్' నిలిచింది .ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరింది. 'విక్రమ్' ఇప్పటివరకు రూ. 450 కోట్లను వసూళ్లు చేసింది. తెలుగులో దాదాపు రూ.18 కోట్ల వరకు కలెక్షన్‌లు సాధించింది. విక్రమ్ సినిమాకు తెలుగులో రూ.10 కోట్ల వరకు లాభం వచ్చింది. తెలుగు వర్షన్‌ను హీరో నితిన్ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై విడుదల చేశారు.
'విక్రమ్' సినిమాను జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
కర్ణాటకలో విక్రమ్ దూకుడు
విక్రమ్ రిలీజ్ అయి యాభై రోజులు పూర్తయింది. కర్ణాటకలో పలు థియేటర్లలో విక్రమ్ ఇంకా ఆడుతూనే ఉంది. కన్నడ ప్రేక్షకులు విక్రమ్ సినిమాను ఆదరిస్తున్నారు. కమల్ హాసన్ సినిమాలకు మొదటి నుంచి కన్నడ, తెలుగు భాషల్లో మంచి డిమాండ్ ఉంది.
కమల్‌ది గొప్ప మనసు
'విక్రమ్' (Vikram) నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. వసూళ్ల పరంగా భారీ బిజినెస్ చేయడంతో కమల్ తెగ సంతోష పడుతున్నారు. 'విక్రమ్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ఖరీదైన లగ్జరీ కారును కానుకగా ఇచ్చారు కమల్. అలాగే, రోలేక్స్ సర్ పాత్రలో నటించిన సూర్యకు రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు.
అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా కొత్త మోడల్ బైక్‌లు కానుకగా ఇచ్చారు. అంతేకాదు చిత్ర యూనిట్ మొత్తానికి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. తన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలంటూ కమల్ హాసన్ పలు భాషల్లో వీడియాలు రిలీజ్ చేశారు.
Read More : Vikram 2 ( విక్రమ్ 2) : కమల్ హాసన్ (Kamal Haasan) ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్ ! ఈ టాప్ 10 విశేషాలు మీకోసమే
Follow Us