సినిమా - షంషేరా
హీరో - రణ్‌బీర్ కపూర్
హీరోయిన్ - వాణి కపూర్
దర్శకుడు - కరణ్ మల్హోత్రా
నిర్మాత - ఆదిత్యా చోప్రా
బ్యానర్ - యష్‌రాజ్ ఫిల్మ్స్
సంగీతం - మిథూన్
షంషేరా సినిమా రివ్యూ - 2.5/5
Shamshera: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన 'షంషేరా' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 'షంషేరా' సినిమాకు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ 'షంషేరా' చిత్రాన్ని నిర్మించింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 50 వ చిత్రం 'షంషేరా'.ఈ చిత్రంలో రణ్‌బీర్, వాణి కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ విలన్ పాత్రను పోషించారు. 'షంషేరా' సినిమాను హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేశారు.
కథ
బల్లి (రణ్‌బీర్ కపూర్) స్వేచ్చ కోసం పోరాడే గిరిజన జాతి యువకుడు. తన కులం తక్కువ కాదంటూ వాళ్ల కోసం పోరాడుతుంటాడు. కుల వివక్షను సహించడు. తన జాతి గౌరవాన్ని కోరుకునే నాయకుడిగా ఎదుగుతాడు. దరోగ శుద్ధ్ సింగ్ (సంజయ్ దత్) గిరిజన కులస్తులను జైళ్లో బంధిస్తాడు. కాజా అనే కల్పిత నగరంలో యోధ తెగను బంధీలుగా చేసి బానిసలుగా చిత్ర హింసలు పెడుతుంటాడు. తన వాళ్లను రక్షించడానికి షంషేరా (రణ్‌బీర్ కపూర్) (Ranbir Kapoor) ప్రాణ త్యాగం చేస్తాడు. ప్రతీకారంగా బల్లి దరోగ శుద్ధ్ సింగ్‌ను ఎదిరిస్తాడు. బల్లీను సోనా (వాణి కపూర్) ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమ గెలుస్తుందా?. బల్లీకి, దరోగ శుద్ధ్ సింగ్‌కు మధ్య జరిగే భీకరమైన యుద్ధంలో గెలిచేదెవరు?. ఓడేదెవరు?. ప్రతీకారం తీర్చుకునేందుకు షంషేరా ఏం చేస్తాడు?. తెలియాలంటే 'షంషేరా' సినిమా చూడాల్సిందే.
రణ్‌బీర్ నటన ఎలా ఉంది?.
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తన స్టార్ డమ్ పక్కన పెట్టి ఓ బలమైన కథ ఉన్న సినిమా 'షంషేరా'లో నటించారు. ఓ యోధుడి పాత్రలో జీవించారు. ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడిగా రణ్‌బీర్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. స్టైలిష్‌గా కనిపించే రణ్‌బీర్ ఈ సినిమా కోసం తన లుక్‌నే మార్చేసుకున్నారు. 'షంషేరా'గా జీ హుజూరు అనిపించారు. డైలాగులు, ఫైట్లు, డాన్సులతో రణ్‌బీర్ థియేటర్లను షేక్ చేస్తున్నారు. డబుల్ రోల్‌లో రణ్‌బీర్ నటించారు.
యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా 'షంషేరా' చిత్రాన్ని రూ. 150 కోట్లతో నిర్మించారు. ఈ చిత్రానికి మిథూన్ సంగీతాన్ని సమకూర్చారు. భారీ డైలాగ్‌లతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 'షంషేరా'లో పీరియాడిక్ యక్షన్ డ్రామా సినిమాగా దర్శకుడు కరణ్ మల్హోత్రా తెరకెక్కించారు. రణ్‌బీర్ కపూర్ యాక్షన్‌తో పాటు కామెడీ, లవ్ సీన్లలో అదరగొట్టారు.
ప్లస్ పాయింట్స్
రణ్‌బీర్ నటన
సంజయ్ దత్ విలనిజం
కామెడీ
మైనస్
స్కీన్ ప్లే
డైలాగులు
కథ
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. రణ్‌బీర్ నటించిన 'షంషేరా' తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. రణ్‌బీర్ కపూర్ మొదటిసారి 'షంషేరా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమాకు తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి మార్కులు వేస్తారో చూడాలి.
Read More: Shamshera: షంషేరా లవ్ సాంగ్ రిలీజ్! - 'నీ పైన పిచ్చి ప్రేమే కదా' అంటున్న వాణి కపూర్
Follow Us