చిరు (Chiranjeevi) దర్శకుడితో చరణ్ (Ram Charan)​ మూవీ సీక్వెల్

చరణ్​ నటించిన హిట్ మూవీ ‘ధృవ’కు సీక్వెల్‌ను ‘గాడ్ ఫాదర్’ (God Father) డైరెక్టర్‌ మోహన్ రాజా తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ​తేజ్ (Ram Charan) మరో క్రేజీ ప్రాజెక్టులో నటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది సీక్వెల్ కానుండటం విశేషం. గతంలో ఆయన యాక్ట్ చేసిన ‘ధృవ’కు ఇప్పుడు సీక్వెల్ రూపొందనుందని వినిపిస్తోంది. 

‘ధృవ–2’ (Dhruva 2) గురించి ఇటీవల నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఓ క్లారిటీ ఇచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలసి ఎన్వీ ప్రసాద్ ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ‘ధృవ’ సీక్వెల్ గురించి ఎన్వీప్రసాద్ కొంత హింట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి చరణ్​‌తో చర్చలు నడుస్తాయని ఆయన చెప్పారు.  

‘ధృవ’ చిత్రానికి ఒరిజినల్ తమిళ వెర్షన్ అయిన ‘తని ఒరువన్’కు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తప్పకుండా చరణ్‌తో మరో సినిమా చేస్తానని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌కు సంబంధించి రామ్ చరణ్‌తో మోహన్ రాజా చర్చలు జరుపుతున్నట్లుగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ రీసెంట్‌గా వివరణ ఇచ్చారు. ఈ చర్చలు సఫలమైతే చరణ్‌తో క్రేజీ మూవీ తెరకెక్కడం ఖాయమనే చెప్పాలి. 

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) ఈరోజే విడుదలైంది. ఒకవేళ ‘ధృవ’ సీక్వెల్‌కు చరణ్​ ఓకే చెబితే.. ఆ  సినిమా పనుల్లో మోహన్ రాజా బిజీ అవ్వొచ్చు. అయితే చరణ్​ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక ప్రకటన వస్తేనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని భావించొచ్చు. దీనికి ఎంత సమయం పడుతుందో తెలియదు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో చరణ్​ బిజీబిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఓకే చెప్పినా ‘ధృవ’ సీక్వెల్ పట్టాలెక్కేందుకు కొంత టైమ్ పట్టేలా ఉంది. ఇక ‘ధృవ’ చిత్రాన్ని స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే, శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ చిత్రానికి కమిటయ్యారు చరణ్​. దీనిపై అధికారికంగా స్పష్టత కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘ధృవ’ సీక్వెల్‌పై వార్తలు వస్తుండటంతో.. రెండింట్లో ఏ మూవీని తొలుత మొదలుపెడతారనేది ఆసక్తికరంగా మారింది. 

Read more: Ram Charan: రామ్ చ‌ర‌ణ్ @ 15 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన చిరంజీవి (Chiranjeevi)

You May Also Like These