మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan) ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది.
శంకర్ గతంలో తెరకెక్కించిన ఇండియన్, శివాజీ లాంటి సినిమాలను పోలి ఉంటుందట ఈ చిత్రం. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 60 శాతం షూటింగ్‌ను ఈ చిత్రం పూర్తి చేసుకుంది.
1000 డ్యాన్సర్లతో..
డిసెంబర్ చివరి వారంలోగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంటుందని అంటున్నారు. ఇటీవలే శంకర్ కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చారు. రామ్ చరణ్ (Ram Charan), కైరా అద్వానీలపై కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఓ స్పెషల్ సాంగ్ తీస్తున్నారట.
పంజాబ్‌లో 3 రోజులు, అలాగే హైదరాబాదులో 6 రోజులు ఈ పాట షూటింగ్ జరగనుంది. జులై 10 వ తేదికల్లా ఈ పాట పూర్తవుతుందని సమాచారం.
భారీ పోరాట సన్నివేశాలు
ఈ పాట పూర్తవగానే, దాదాపు 1200 మంది ఫైటర్లతో రామ్ చరణ్ (RamCharan) తో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని డిజైన్ చేస్తున్నారట డైరెక్టర్ శంకర్ (Shankar) . ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని పోరాట సన్నివేశాలను మించి ఉంటుందట.
దాదాపు 20 రోజుల పాటు ఈ యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన షూట్‌ను హైదరాబాద్‌లో పూర్తి చేయనున్నారట. ఈ సన్నివేశాల చిత్రీకరణ గనుక పూర్తి అయితే, దాదాపు 70 శాతం సినిమా పూర్తి అయిపోయినట్లేనని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ దాదాపు ఇండియాలోనే జరిగినప్పటికీ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రం కొన్ని షెడ్యూల్స్ విదేశాలలో ప్లాన్ చేశారట. నవంబర్ నెల పూర్తయ్యేలోగా, 95 షూటింగ్ పూర్తయ్యేటట్లు శంకర్ టీమ్ ప్లాన్ చేస్తోందట. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో తెరకెక్కుతున్న RC15 సినిమాను 2023 లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Read More: రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన.. బాలీవుడ్ బడా హీరో తల్లి !
Follow Us