ప్రణీత సుభాష్.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈమె పేరు బాగా సుపరిచితమే. ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం లాంటి తెలుగు చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఈమె పలు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. ఇటీవలే హంగామా 2 ద్వారా బాలీవుడ్ పరిశ్రమకు కూడా పరిచయమయ్యారు. తన నటన ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రణీత సుభాష్ (Pranitha Subhash).
పవన్ కల్యాణ్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు
పవన్ కళ్యాణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా అత్తారింటికి దారేదిలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ప్రణీత. ఆ సినిమాలో హీరోయిన్ సమంతతో పోటీపడి మరీ ప్రణీత నటించారు. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే కార్తితో కలిసి తమిళంలో నటించిన 'శకుని' చిత్రానికి కూడా మంచి మార్కులే సంపాదించుకున్నారు.
సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనడం ప్రణీతకు అలవాటు. కర్ణాటకలోని పలుచోట్ల స్కూలు పిల్లలను దత్తత తీసుకొని, ఆమె చదివిస్తున్నారు. ప్రణీత వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. ఇటీవలే ప్రణీత ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాను తల్లి అవడం ఓ అదృష్టంగా భావిస్తున్నానంటూ ప్రణీత (Pranitha Subhash) ఇన్ స్టాలో తెలిపారు. తన చిన్నారిని చూస్తుంటే ఆనందంగా ఉందని.. ఏదో తెలియని మధురమైన అనుభూతి కలుగుతుందన్నారు. అభిమానులకు తన మదర్ హుడ్ గురించి ఎప్పుడెప్పుడు చెప్పాలా? అని ఎదురుచూశానన్నారు. తనకు వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలంటూ చెబుతూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. ప్రణీత మదర్ హుడ్కి స్వాగతం అంటూ పలువురు సినీ ప్రముఖులు విష్ చేస్తున్నారు.
Read More : బిడ్డ పుట్టాక ట్రెండీ గౌనులో హీరోయిన్ ప్రణీత ఫొటోషూట్.. ఫొటోలు వైరల్!
Follow Us