పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) .. ప్రస్తుతం అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో మణిరత్నం మరోసారి చారిత్రక కథతో చేస్తున్న ప్రయోగం ఈ చిత్రం. ఈ రోజే ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ జరిగింది. ఈ క్రమంలో మనం కూడా ఈ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
అతిరథ మహారథులు
పొన్నియిన్ సెల్వన్ సినిమా టీజర్ రిలీజ్ వేడుకకు అతిరథ మహారథులు ఎందరో హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు, సూర్య, మోహన్ లాల్, రక్షిత్ శెట్టి లాంటి గొప్ప నటులెందరో ఈ వేడుకలో పాల్గొన్నారు.
కల్కి నవలకు అనుకోని గుర్తింపు
ప్రముఖ నవలా రచయిత కల్కి క్రిష్ణమూర్తి 1950 ల్లో వ్రాసిన రచన పొన్నియిన్ సెల్వన్. 10 వ శతాబ్డం కాలం నాటి చోళుల అధికార దర్పాన్ని చాటే ఈ కథ ఇప్పుడు సినిమాగా రూపాంతరం చెందనుంది.
చారిత్రక పాత్రలలో ప్రముఖులు
మణిరత్నం (Maniratnam) దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ నందిని పాత్ర పోషించగా, సూపర్ స్టార్ విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా, అలాగే కార్తి వందియ దేవన్‌గా, త్రిష కుందవైగా, జయం రవి అరుణ్ మోజీ వర్మన్ పాత్రలలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.
ఇదే కథ
చోళ రాజ్యంలో వందియ్ దేవన్ అనే గొప్ప యోధుడు, యుద్ధవీరుడు ఉంటాడు. ఆదిత్య కరికాలన్‌కి ఇతడు గొప్ప స్నేహితుడు. రాకుమారి కుందవైతో వందియ దేవన్ ప్రేమలో పడతాడు. మరోవైపు ఆదిత్య కరికాలన్‌ని పజువూర్ యువరాణి నందిని ప్రేమిస్తుంది.
ఆదిత్య కరికాలుడి సోదరుడు అరుణ్ వర్మన్ తర్వాత చోళ రాజ్యానికి పట్టాభిషక్తుడై పొన్నియన్ సెల్వన్‌గా అందరిచేతా పిలవబడతాడు. కానీ అంతర్గత తగాదాల వల్ల వీరి రాజ్యం ఓ సమస్య వస్తుంది. దానిని పొన్నియన్ సెల్వన్ ఎలా పరిష్కరిస్తాడన్నదే చిత్రకథ.
సాంకేతిక వర్గం
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, రవి వర్మన్ ఛాయాగ్రహణ బాధ్యతలను స్వీకరించారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
నిర్మాణం
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మద్రాస్ టాకీస్ సంస్థ మణిరత్నం సొంత సంస్థ కావడం విశేషం.
భారీ బడ్జెట్
దాదాపు రూ.500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారట.
ఎలంగో కుమార్వేల్‌తో కలిసి స్క్రీన్ ప్లే
ఆకాశమంత, గగనం లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటుడు కుమార్వేల్. మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్. ఈయన ఓ నాటక సంస్థను కూడా నడుపుతున్నారు. కుమార్వేల్‌తో కలిసి మణిరత్నం ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్
సైరా నరసింహారెడ్డి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన శ్రీకర్ ప్రసాద్.. ఈ చిత్రానికి కూడా తన సేవలను అందిస్తున్నారు.
భారీ తారాగణం
దాదాపు 50 మంది పెద్ద పెద్ద తారలు ఈ సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం కవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం, ప్రకాష్ రాజ్, పార్తిబన్, రెహమాన్ మొదలైన వారు ఈ సినిమాలో నటిస్తున్నారు.
Read More: 'రాణి నందిని దేవి'గా మాజీ ప్రపంచ సుందరి .. పవర్‌ఫుల్ పాత్రలో ఐశ్వర్యరాయ్
Follow Us