Aishwarya Rai Bachchan Birthday Special - కళ్ళతో ఆకట్టుకునే నటన ప్రపంచ సుందరి సొంతం

మాజీ ప్రపంచ సుందరిగా నలుదిశలా శాంతిని పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) బచ్చన్ పుట్టిన రోజు నేడు. 

ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రపంచం మెచ్చిన సౌందర్య దేవత. ఆమె అందం ఓ అద్భుతం. నీలి రంగు కళ్లతో నింగిని సైతం ఆకట్టుకునే అభినయం ఐశ్వర్య సొంతం. సినీ జగత్తులో ఐశ్వర్య రాయ్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. 

మాజీ ప్రపంచ సుందరిగా నలుదిశలా శాంతిని పంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. 

ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం..

బాల్యం
ఐశ్వర్య రాయ్ 1973 నవంబర్ 1 తేదీన జన్మించారు. ఐశ్వర్య రాయ్ కర్ణాటకలోని మంగళూరులో తుళు భాష మాట్లాడే బంట్ కుటుంబానికి చెందినవారు. ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణ రాజ్ ఆర్మీలో పని చేశారు. ఆమె తల్లి బృంద. ఐశ్వర్య రాయ్ అన్నయ్య ఆదిత్య రాయ్. 2003లో ఐశ్వర్య నటించిన "దిల్ కా రిష్తా" సినిమాకు ఆమె అన్నయ్య సహ నిర్మాతగా వ్యవహరించగా, తన తల్లి సహ రచయితగా ఉన్నారు.

ఐశ్వర్య చిన్నతనంలోనే ఆమె తండ్రి ముంబైకి మకాం మార్చారు. ఐశ్వర్య ఆర్య విద్యా మందిర్ హై స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం జై హింద్ కళాశాలలో పూర్తి చేశారు. మతుంగాలోని డిజి రుపరెల్ కళాశాలలో ఐశ్వర్య రాయ్ తన ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశారు. హెచ్.ఎస్.సి పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించారు.

ఐదేళ్ళ పాటు ఐశ్వర్య రాయ్ శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. డాక్టర్ కావాలని ఐశ్వర్యరాయ్ అనుకున్నారట. కానీ ఆర్కిటెక్ట్ అవ్వాలనే కోరికతో సంసంద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరారు. చివరకు మోడలింగ్ వైపుకు వెళ్లారు ఐశ్వర్య.

మోడలింగ్ నుంచి నటి
1991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన "అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్" లో ఐశ్వర్య మొదటి స్థానంలో నిలిచారు. ఆ రోజుల్లో ప్రఖ్యాత అమెరికన్ పత్రిక వోగ్ లో ఐశ్వర్య రాయ్ గురించిన వార్తలు ప్రచరితమయ్యాయి. 1993లో నటుడు ఆమిర్ ఖాన్, నటి  మహిమా చౌదరిలతో  కలసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది. "హాయ్ అయాం సంజన" అని ఆమె చెప్పే ఒక్క డైలాగ్ చాలా ఫేమస్ అయింది. 

మిస్ వరల్ట్  ఐశ్వర్య రాయ్
1994 మిస్ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్ మొదటి స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో నిలవాలనుకున్న ఐశ్వర్య రెండో స్థానం సంపాదించుకున్నారు. అదే ఏడాది మరో పోటీ ఐశ్వర్య జీవితాన్నే మార్చేసింది. 1994 లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్య రాయ్  (Aishwarya Rai Bachchan) విన్నర్ గా నిలిచారు. మిస్ వరల్ట్ టైటిల్ తో పాటు మిస్ కాట్ వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్ టైటిళ్ళు కూడా గెలుచుకున్నారు. 

ఇక సౌత్  ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఐశ్వర్య రెండో స్థానం గెలుచుకున్నారు. ఆ పోటీల్లో మిస్ ఫోటోజెనిక్, మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ-ఆసియా అండ్ ఒషెనియా టైటిళ్ళను గెలుచుకున్నారు.

బాలీవుడ్ ఎంట్రీ
1997లో తమిళ చిత్రం #ఇరువర్" తో ఐశ్వర్య సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కిన "ఇరువర్" తెలుగులో "ఇద్దరు" పేరుతో రిలీజ్ అయింది. తర్వాత "హర్ ప్యార్ హో గయా" సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 1998లో రిలీజ్ అయిన తమిళ సినిమా 'జీన్స్" ఐశ్వర్య రాయ్ కెరీయర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. 

1999లో దర్శకుడు సంజయ్ లీలీ బన్సాలీ తెరకెక్కించిన "హమ్ దిల్ దే చుకే సనమ్" చిత్రం ఐశ్వర్య రాయ్ కు మంచి బ్రేక్ తెచ్చి పెట్టింది.  అజయ్ దేవగణ్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య ఉత్తమ నటిగా "ఫిలిమ్ ఫేర్" అవార్డును అందుకున్నారు.

1999లో తెలుగులో నాగార్జున నటించిన "రావోయి చందమామ"లో లవ్ టూ లీవ్ అనే స్పెషల్ పాత్రలో నటించారు. హిందీలో తాల్, దేవదాస్ సినిమాలు ఐశ్వర్య రాయ్ కు బిగెస్ట్ హిట్స్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాతో ఐశ్వర్య రాయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 
బంటీ ఔర్ బబ్లీ, ధూమ్ 2, గురు సినిమాలలో తన భర్త అభిషేక్ బచ్చన్ తో పాటు నటించారు. బంటీ ఔర్ బబ్లూలో "కజ్ రారే" పాటలో అభిషేక్, అమితాబ్ లతో కలిసి చేసిన డాన్సులు ప్రేక్షకులను మెప్పించాయి. 2007లో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లి తరువాత కూడా ఐశ్వర్య రాయ్ సినిమాలలో నటించారు. జోధా అక్చర్, రోబో, రావణ, రావణన్, గుజారిష్ వంటి సినిమాలలో నటించారు. ఐశ్వర్య పలు ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "పొన్నియిన్ సెల్వన్ 1"లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ రాణి నందిని దేవీ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఐశ్వర్య "పొన్నియిన్ సెల్వన్ 2"లో నటిస్తున్నారు. 

49 ఏళ్ల ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ (AishwaryaRai) హిందీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించారు. 

యాడ్స్ ఐశ్వర్యకు స్పెషల్
టైటాన్ వాచెస్, లాంజైన్స్, ఎల్ ఓ రియల్, కొకకోలా, లాక్మె కాస్మొటిక్స్, కేసియో పేజర్, ఫిలిప్స్, పామొలివ్, లక్స్, ఫుజి ఫిల్మ్, నక్షత్ర డైమండ్ జ్యుయెల్లరీ, కళ్యాణ్ జ్యుయెల్లరీ.. లాంటి టాప్ రేంజ్ కంపెనీ యాడ్స్‌లో ఐశ్వర్య రాయ్ నటించారు. అప్పట్లో ఐశ్వర్య రాయ్  (Aishwarya Rai Bachchan) యాడ్స్ కోసం అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారట.

పురస్కారాలు
హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాసు చిత్రాలకు గానూ ఐశ్వర్యరాయ్ ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ అవార్డును అందించింది. అంతేకాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం  ఒర్డ్రే డెస్ ఆర్ట్స్ డెస్ లెటర్స్ అనే అవార్డుతో సత్కరించింది. 


2003లో కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కు భారతదేశం నుంచి జ్యూరీగా సెలెక్ట్ అయి రికార్డు సాధించారు ఐశ్వర్యరాయ్. జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్ కు అంబాసిడర్ గా ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలకు సంబంధించిన సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. 

Read More: Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వ‌న్‌'లో న‌టించ‌డం గ‌ర్వంగా ఉంది : ఐశ్వర్యరాయ్ (AishwaryaRai)

ఐశ్వర్య రాయ్ మాజీ ప్రపంచ సుందరిగానే కాకుండా నటిగా  ప్రపంచ సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రేక్షకులకు మరింత వినోదం అందించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే ఐశ్వర్య రాయ్ బచ్చన్.
పింక్ విల్లా.
Credits: Wikipedia
You May Also Like These