మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నెక్ట్స్ ఇటీవల 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మధ్య బైక్ యాక్సిడెంట్ కావడం వల్ల సాయిధరమ్ తేజ్ హాస్పిటల్‌కే పరిమితం అయ్యారు. అసలు చాలా రోజుల వరకు బయటకు రాలేదు. కొన్నిరోజులు డాక్టర్స్ సాయిధరమ్ తేజ్‌ను రెస్ట్ తీసుకోమని సూచించడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. అయితే, ఈ మధ్యే కోలుకోవడంతో నెక్ట్స్ మూవీ షూటింగ్‌కి రెడీ అవుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆయన మేనల్లుడు అయిన సాయితేజ్ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి అన్నీ తానై నడిపిస్తున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా త్రివిక్రమే రాశారట.. అయితే హారిక-హాసిని క్రియేషన్స్ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ సినిమాకి తన పేరు వేయించుకోవడం లేదని సమాచారం.దానికి బదులుగా తన సొంత నిర్మాణ సంస్థను ఈ ప్రాజెక్ట్ కి ఎటాచ్ చేశారని తెలుస్తోంది.
తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతమ్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారట. ఇందులో సాయిధరమ్‌కి జోడీగా సంయుక్త మీనన్‌ని (samyuktha menon) ఎంచుకొన్నారని తెలుస్తోంది. జులైలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలుస్తాయి.
ఇంతకుముందు.. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రంలో మెరిశారు సంయుక్త మీనన్. చిన్న పాత్రే అయినా, ఆమె నటన గుర్తుండిపోతుంది. ఇప్పుడు తెలుగులో ఆమెకు మంచి ఆవకాశాలే వస్తున్నాయి. తాజాగా సాయిధరమ్ తేజ్ సరసన నటించే ఆఫర్ వచ్చిందని టాక్. అయితే మెగా మేనల్లుడు మాత్రం కథలను వినడంలో బిజీగా ఉన్నారు. ఏమాత్రం మంచి కథ అనిపిస్తే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనేదే తన ఆలోచనగా కనిపిస్తోంది.
Follow Us