టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (Pushpa The Rise). ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
‘పుష్ప: ది రైజ్’ (Pushpa The Rise) విడుదలైన అన్ని భాషలలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule) అంటూ వచ్చేస్తోంది బన్నీ టీమ్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీక్వెల్ అప్‌డేట్ రానే వచ్చింది.
ప్రస్తుతం 'పుష్ప ది రూల్' సినిమాకి సంబంధించిన పోస్టర్ డిజైన్ కోసం హీరో, హీరోయిన్స్ పై ఫోటోషూట్ జరుగుతోందని, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ (Avinash Gowariker) ఆధ్వర్యంలో తామందరం ఎంతో కష్టపడుతూ ఆడియన్స్ కి బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చేందుకు పోస్టర్స్ ని సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ స్టిల్ ను బట్టి "పుష్ప: ది రూల్" కోసం అల్లు అర్జున్ (Allu Arjun) పై ఫొటోషూట్ సెషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా పుష్ప : ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇక, రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
‘పుష్ప 2’కోసం ‘అల్లు స్టూడియో’ (Allu Studio)లో సుకుమార్ భారీ సెట్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ ఫారెస్ట్ ఏరియాలోని.. కెన్యా పర్వతాలను తలపించేలా ఈ భారీ సెట్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. సునీల్, అనసూయ, కేశవ, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సమంత, ప్రియమణి కూడా అలరించబోతున్నారని టాక్ నడుస్తోంది.
Follow Us