దసరా పండుగ సందర్భంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi Konidela)పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో గరికపాటిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా చిరంజీవి స్పందించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ కాంట్రవర్సీపై చిరు పెదవి విప్పారు. గరికపాటి వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని మెగాస్టార్ అన్నారు.
‘గరికపాటి కామెంట్లపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ అనవసరం’ అంటూ ఈ ఉదంతానికి చిరంజీవి ఎండ్ కార్డ్ వేసేందుకు ప్రయత్నించారు. ఇక, దీనిపై ఇప్పటివరకూ గరికపాటి స్పందించలేదు. అయితే, తన కామెంట్స్ ద్వారా ఈ వివాదానికి ఇంతటితో చిరు ముగింపు పలికారనే చెప్పారు. మరి, ఈ కాంట్రవర్సీకి ఇక్కడితో చెక్ పడుతుందేమో చూడాలి.
కాగా, వివాద విషయంలోకి వెళ్తే.. బండారు దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా గత కొన్నేళ్లుగా ‘అలయ్ బలయ్’ (Alai Balai) కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆత్మీయ ఆలింగనం ప్రాధాన్యాన్ని, తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని గురించి తెలిపేలా ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ ఘనంగా జరుపుతుంటారు. ఈ ఏడాది కూడా ‘అలయ్ బలయ్’కు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
సెల్ఫీలు ఆపకుంటే వెళ్లిపోతా
‘అలయ్ బలయ్’ వేదికపై గరికపాటి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో కార్యక్రమానికి హాజరైన చిరంజీవితో కొందరు అభిమానులు సెల్ఫీలు దిగుతున్నారు. ఇది నచ్చని గరికపాటి ‘ఫొటో సెషన్ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ హెచ్చరించారు. దీంతో అక్కడున్నవారు ఆయనకు సర్దిచెప్పారు. కాసేపటికి చిరు వేదిక మీదకు రావడంతో గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. కార్యక్రమంలో గరికపాటి ప్రవర్తించిన తీరుపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే మొత్తానికి చిరంజీవి ఈ విషయంపై చర్చలు అవసరం లేదనడంతో కాంట్రవర్సీకి దాదాపుగా ఎండ్ కార్డ్ పడినట్లేనని చెప్పాలి.
Read more: ‘ఆటో జానీ’ కథ ఏమైంది?.. ఆసక్తికరంగా చిరు (Chiranjeevi Konidela), పూరి (Puri Jagannadh) ఇంటర్వ్యూ
Follow Us