టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi) 'ఆచార్య' డిజాస్టర్ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అభిమానులకు బ్లాక్ బాస్టర్ సినిమాలతో వినోదం పంచాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కాంబినేషన్‌లో 'మెగా 1 54' తెరకెక్కుతోంది. 'మెగా 154' సినిమా ఓటీటీ డీల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'మెగా 154' సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని టాక్.
ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కేనా!
ప్రస్తుతం 'మెగా 154' సినిమా షూటింగ్ దశలో ఉంది. రాజమండ్రి, వైజాగ్ పాంత్రాలలో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ దశలో ఉన్న సినిమాకు ఇన్ని కోట్ల ఓటీటీ డీల్ కుదరటంపై సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు రూ. 50 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందట.
'గాడ్‌ఫాదర్' సినిమా హక్కులను కూడా రూ.57 కోట్లతో సొంతం చేసుకోనుందట నెట్‌ఫ్లిక్స్. చిరంజీవి (Chiranjeevi) నటించన 'ఆచార్య' ఫ్లాప్ ఎఫెక్ట్ తరువాత సినిమాలపై పడే అవకాశమే లేదని అభిమానులు అంటున్నారు. చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటున్నారు.
థియేటర్లలో జాతరే
'మెగా 154'లో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజతో పాటు వెంకటేష్, నాగార్జున కూడా గెస్ట్ రోల్స్‌లో నటిస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్'లో మరో ముగ్గురు హీరోలు నటించారు. 'విక్రమ్' బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
'మెగా 154'లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరోలతో గెస్ట్ రోల్స్ చేయించాలని బాబి ప్లాన్ చేశారని సమాచారం. ఇక చిరంజీవి (Chiranjeevi), నాగార్జున, వెంకటేష్, రవితేజాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు షేక్ అవడం గ్యారెంటీ అంటున్నారు సినీ క్రిటిక్స్.
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 2023 సంక్రాంతి పండుగకు 'మెగా 154' చిత్రం విడుదల కానుంది.
Read More: 'మెగా 154' (Mega 154) షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టిన మాస్ మహారాజ్ రవితేజ..!
Follow Us