కాంతార (Kantara).. ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రిషబ్‌శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా రికార్డులు సృష్టిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కాంతార సినిమాలోని పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సినిమా క్లైమాక్స్‌లో రిషబ్‌శెట్టి రూపకానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ‘వరాహ రూపం.. దైవ వరిష్టం’ అనే పాట మరో రేంజ్. ఆ పాట లిరిక్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అటువంటి నృత్య రూపకానికి సంబంధించిన లిరికల్, మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమాలోని ఈ పాట లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. కాంతార సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించగా.. షాహికపూర్ సాహిత్యం అందించారు. సాయి విఘ్నేష్ ఆలపించారు.
కేవలం 5 రాత్రులలోనే..
క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాటను కేవలం 5 రాత్రులలోనే తెరకెక్కించినట్టు చెప్పారు రిషబ్‌శెట్టి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రిషబ్‌శెట్టి.. కాంతార సినిమాకు సంబంధించిన పలు అంశాలను పంచుకున్నారు. ‘నేను అంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా. కాంతార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోలేదు. ఒక కథ ఉంది. దానిని ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా. నా టీమ్‌తో కలిసి దీనిని రూపొందించా. ఏకాగ్రత, అంకితభావంతో సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఉపవాసం చేశాను. ఆ దేవుడే మా వెంట ఉండి షూటింగ్ పూర్తి చేశారని అనుకుంటాను’ అని చెప్పుకొచ్చారు రిషబ్ శెట్టి.
సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన కాంతార సినిమాలో కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్‌శెట్టి కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 5వ తేదీన విడుదలైన కాంతార సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. రిషబ్‌శెట్టి (Rishab Shetty) నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
Follow Us