Naga Chaitanya: బాలీవుడ్‌లో మరోసారి నెపోటిజం సెగ రగులుతోంది. ఈ నేపథ్యంలో ఒక సినిమా తర్వాత మరో సినిమాను ప్రేక్షకులు బాయ్‌కాట్ చేస్తూ వస్తున్నారు. హిందీ ఇండస్ట్రీలో ఈ నెలలో ఇప్పటికే విడుదలయిన సినిమాలేవీ కనీస కలెక్షన్లు రాబట్టలేక థియేటర్ల నుంచి వెనక్కి తగ్గాయి. దీంతో ఆయా సినిమాల హీరోలకు, దర్శక నిర్మాతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నెపోటిజం (Nepotism) గురించి ప్రశ్నలు ఎదురు కాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఆ ప్రశ్నల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'నెపోటిజం ప్రభావం అనేది బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాన పెద్దగా కనిపించదు. అసలు ఇది ఎందుకు మొదలైందో కూడా అర్థం కావడం లేదు. దీని గురించి నన్ను అడిగినప్పుడల్లా నా అభిప్రాయం ఇదేనని' పేర్కొన్నాడు.
'మా తాత(అక్కినేని నాగేశ్వరరావు) ఓ నటులే. మా నాన్న నాగార్జున (Nagarjuna) కూడా నటుడే. చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ పెరిగాను. వారి ప్రభావం కచ్చితంగా నాపై పడుతుంది కదా! వారిని చూసి నేనూ నటుణ్ని కావాలని ఆశపడ్డాను. వారినే స్ఫూర్తిగా తీసుకుని నటుడిని అయ్యాను. అలా వారు చూపించిన దారిలో నేను నా పని చేసుకుంటూ వెళ్తున్నా.. ఈ జర్నీ అలాగే కొనసాగుతుంది' అంటూ చెప్పుకొచ్చాడు.
నా సినిమా, బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడి సినిమా ఒకేరోజు థియేటర్లలో విడుదలై బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడి సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అందరూ తననే ప్రశంసిస్తారని నాగచైతన్య చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో పోటీ అనేది సమానంగా ఉంటుందని నాగచైతన్య కామెంట్లు చేశారు.
ఇదిలా ఉంటే.. నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవలే నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చైతూ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇందులో నాగ చైతన్య బోడి బాలరాజుగా నటించి ప్రేక్షకుల మన్నలను అందుకున్నాడు.
కానీ, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 'లాల్ సింగ్ చడ్డా' సినిమాకు రిలీజ్ కు ముందే బాయ్ కాట్ సెగ తగిలింది. దాంతో ఈ సినిమా పై నెగిటివిటీ ఎక్కువై సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించింది.
Read More: పెళ్లి తేదీని టాటూగా వేయించుకున్న నాగచైతన్య (Naga Chaitanya).. టాటూ తీసేయాలనుకోవడం లేదన్న చై
Follow Us