తమిళ నటుడు కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' (Khaidi) సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మాస్ ఆడియన్స్ ని బీభత్సంగా ఆకట్టుకున్న ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
కాగా, 'ఖైదీ' చిత్రంతో కార్తీ (Hero Karthi) వంద కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టాడు. అంతేకాకుండా తెలుగులో కార్తి మార్కెట్ అమాంతం పెరిగింది. లోకేష్ కనగరాజ్ టేకింగ్, విజన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. మరోవైపు.. లోకేష్ కనగరాజ్ ఇటీవల కమల్ హాసన్ తో 'విక్రమ్' సినిమా తెరకెక్కించారు. అయితే, ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలిసిందే.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విజయ్ దళపతితో (Thalapathy Vijay) ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే 'ఖైదీ 2' (Khaidi Sequel) సినిమా చేయనున్నారు. తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయాలనుకుంటున్నారట.
ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్-1' (Ponniyin Selvan-1) ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిని 'ఖైదీ 2' గురించి అడగ్గా, ఆయన స్పందించారు. వచ్చే ఏడాది 'ఖైదీ 2' మొదలుపెడతాం అని అన్నారు. తొలి భాగంతో పోలిస్తే,ఈ సారి బడ్జెట్ కూడా బాగా పెంచినట్లు కోలీవుడ్ సమాచారం. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఇదివరకే వార్తలు వినిపించినా, కార్తీ స్పష్టత ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ ౩౦న విడుదల కానుంది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Follow Us