Sitaramam Trailer: కోలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ (Dulquer Salman) సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న నటించింది.
ఇక, ‘సీతారామం’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వివిధ పాత్రల లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'లెఫ్ట్‌నెంట్ రామ్ నాకు ఓ బాధ్యత అప్పగించాడు' అనే వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక ఈ సినిమాలో (Actor Sumanth) సుమంత్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఆయన భార్యగా భూమిక నటిస్తోంది.
‘సీతారామం’ ట్రైలర్ (Sitaramam Trailer) రెండు నిమిషాలకు పైగా సాగుతూ ప్రేక్షకులలో ఉత్కంఠరేపింది. రామ్, సీతామాలక్ష్మిల ఎమోషనల్ లవ్ జర్నీ ఎలా సాగింది? వారి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే, ఈ సినిమా చూడాల్సిందే. ఎన్నో సస్పెన్స్ ఎలిమెంట్స్ కలిగిన చిత్రమిది.
అనాధైన లెఫ్టినెంట్ రామ్‌కి. సీతామాలక్ష్మి అనే అమ్మాయి ప్రేమ లేఖలు రాస్తుంది. తనకు పరిచయం లేని వ్యక్తి నుండి ప్రేమలేఖలు రావడం రామ్‌ని అయోమయానికి గురి చేస్తుంది. మరి వారి బంధం ఏ విధంగా ముందుకు సాగిందనేదే ఈ సినిమా కథ.
1965లో జరిగిన ఓ పీరియాడిక్ లవ్ స్టోరీతో ప్రస్తుత కాలంలో ఉన్న రష్మిక(Rashmika Mandanna)కు సంబంధం ఏమిటన్నదే ఈ సినిమాలోని ప్రధానమైన సస్పెన్స్ ఎలిమెంట్. 20 ఏళ్ల క్రితం రామ్ తన ప్రేయసి సీతామాలక్ష్మికి రాసిన లేఖ రష్మిక వద్దకు అనుకోకుండా చేరుతుంది.
ఈ క్రమంలో రష్మిక సీతామాలక్ష్మి కోసం తన అన్వేషణను సాగిస్తుంది. అసలు లెఫ్టినెంట్ రామ్, సీతామాలక్ష్మి ఏమైపోయారు? అసలు సీతామాలక్ష్మితో రష్మికకు (Rashmika Mandanna) సంబంధం ఏమిటి అనేది అసలు కథ.
‘సీతారామం’ మూవీ ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌లో దర్శకుడు హను రాఘవపూడి (Director Hanu Raghavapudi) కథ గురించి చాలా హింట్స్ ఇచ్చేశారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, జిష్షు సేన్ గుప్తా తదితరులు నటించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించగా.. పాటలతో పాటు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
Read More: 'సీతారామం' ట్రైలర్ డేట్ ఫిక్స్.. దుల్కర్, రష్మిక (Rashmika Mandanna) పాత్రలే కథకు బలమట!
Follow Us