Samantha Ruth Prabhu: సమంత మొదటిసారి నాగచైతన్యతో విడాకుల గురించి మాట్లాడారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో సమంత పాల్గొన్నారు. పెళ్లి, విడాకులపై ఆశక్తికరంగా స్పందించారు.సంతోషంగా లేని పెళ్లి బంధాలకు కరణ్ జోహార్ కారణమంటూ పంచులు విసిరారు. సమంత చేసిన కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu: సమంత, నాగచైతన్యలు పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడిపోయారు. ఎందుకు విడిపోయారో తెలియదు కానీ.. సమంత మాత్రం నాగచైతన్యపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఇన్ డైరెక్టుగా పోస్టులు పెడుతుంటారు.
విడాకులపై ఓపెన్ అయిన సామ్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.జూలై ఏడో తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ, సమంత, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ఆ షోలో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ షోకు హాజరయిన సమంత వివాహ జీవితంపై
కామెంట్లు చేశారు.
పెళ్లి తర్వాత జీవితం కేజీఎఫ్‌లా ఉంటుంది - సమంత
కరణ్ జోహార్ ఫ్యామిలీ లైఫ్ గురించి సమంతని ప్రశ్నించారు. వివాహ బంధాలు సంతోషంగా సాగకపోవడానికి కారణం ఏంటని కరణ్ సమంతను ప్రశ్నించారు. అందుకు సమంత దాంపత్య జీవితం సంతోషకరంగా లేకపోవడానికి కారణం కరణే అంటూ సమాధానం ఇచ్చారు. కరణ్ తీసిన కుటుంబ కథా చిత్రం కభీ ఖుషీ కభీ ఘమ్లా వివాహ బంధాలు ఉంటాయనుకుంటారు. కానీ పెళ్లి తర్వాత కేజీఎఫ్ సినిమాలా వైలెంట్‌గా ఉంటాయని సమంత సమధానం చెప్పారు.
Samantha Ruth Prabhu: సమంత, నాగచైతన్యల విడాకులకు కారణం తెలియదు. కానీ విడిపోయాకా వీరిద్దరూ కెరియర్‌పై దృష్టి పెట్టారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత నటించిన యశోద చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. మరో సినిమా శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. విజయ్ దేవరకొండతో సమంత ఖుషి సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీలో కూడా సామ్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
Read More: నాగ చైతన్యతో 'శోభిత ధూళిపాళ' డేటింగ్ ! అయితే సమంత (Samantha) కు ఎందుకంత కోపం ?
Follow Us