Ajay Bhupathi: 'ఆర్ఎక్స్100' (RX100) డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ దర్శకుడితో చేతులు కలిపిన అజయ్ భూపతి!

అజయ్ భూపతి (Ajay Bhupathi), రాజ్ కుమార్ హిరాని (Rajkumar Hirani) ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్టు గురించి గత సంవత్సర కాలంగా చర్చలు జరుపుతున్నారట.

Ajay Bhupathi: "ఆర్ఎక్స్ 100" సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నారు. 2018లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఒక్క సినిమాతోనే డైరెక్టర్ అజయ్ భూపతి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మ్యూజిక‌ల్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచి..నిర్మాత‌లకు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నా.. ఇంకా ఆ ప్రభావం యూత్ నుంచి తగ్గలేదు. 

అజయ్ భూపతి ఆ త‌ర్వాత యంగ్ హీరో శ‌ర్వానంద్‌ (Sharwanand), లవర్ బాయ్ సిద్దార్థ్‌తో క‌లిసి తెర‌కెక్కించిన 'మ‌హాస‌ముద్రం' ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేక‌పోయింది. దీంతో అజయ్ భూపతి తదుపరి ప్రాజెక్ట్ పై ఓ ఆసక్తికర వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. 

అదేంటంటే, తాజాగా అజయ్ భూపతి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానితో (Rajkumar Hirani) చేతులు కలపబోతున్నాడట. అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన రెండు సినిమాల‌తో ఇంప్రెస్ అయిన రాజ్ కుమార్ ఆయనను బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ న‌డుస్తోంది. 

అజయ్ భూపతి (Ajay Bhupathi), రాజ్ కుమార్ హిరాని ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్టు గురించి గత సంవత్సర కాలంగా చర్చలు జరుపుతున్నారట. అజయ్ భూపతి కొన్ని షార్ట్ ఐడియాస్ ను వినిపించగా హిరానీ అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే హిరానీ సెలెక్ట్ చేసిన ఆ స్క్రిప్ట్ కి అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు అజయ్ భూపతి మరికొందరు రైటర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

రాజ్ కుమార్ హిరానీ ప్ర‌స్తుతం షారుక్‌ఖాన్‌తో (Shah Rukh Khan) చేస్తున్న‌ 'డుంకీ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మ‌రి ఈ స్టార్ డైరెక్ట‌ర్ సార‌థ్యంలో అజ‌య్ భూప‌తి బీటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న అప్‌డేట్‌పై ఏదైనా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే క్లారిటీ వస్తుంది. మరోవైపు హిందీలో '3 ఇడియట్స్', 'సంజు', 'పీకే', 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు రాజ్ కుమార్ హిరానీ.

You May Also Like These