శాండల్‌వుడ్‌లో ‘కాంతార’ (Kantara) మూవీ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. చిన్న సినిమాగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్‌ను ఇంకా కొనసాగిస్తోంది. ఈ ఫిల్మ్‌ను చూసేందుకు కన్నడ నాట ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు మిగిలిన భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ‘కాంతార’ హిందీ వెర్షన్ విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం మరో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్స్ (IMDB Ratings) పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది.
‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందిన హొంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ‘కాంతార’ తెరకెక్కింది. యాక్షన్, థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయనే కథానాయకుడిగా నటించడం విశేషం. ఇక ఈ మూవీ ఐఎండీబీలో 9.6 రేటింగ్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తద్వారా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’తోపాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్’ సినిమాకు ఐఎండీబీలో 8.4 రేటింగ్ రాగా.. ‘ఆర్ఆర్ఆర్’కు 8 రేటింగ్స్ ఉండటం విశేషం.
కోస్టల్ కర్ణాటకలో కనిపించే కంబ్లా, బూట కోలా సంప్రదాయాలు, సంస్కృతిని అన్వేషించే యాక్షన్ థ్రిల్లర్ గా ‘కాంతార’ చిత్రం తెరకెక్కింది. ఇందులో రిషబ్ శెట్టి రెండు విభిన్న క్యారెక్టర్స్‌లో కనిపిస్తున్నారు. ఈ మూవీలో రిషబ్ పక్కన సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటివరకు కర్ణాటకలో ఈ సినిమా దాదాపు రూ. 58 కోట్లు వసూలు చేసింది. ఉత్తరాదిన ఇవ్వాళ రిలీజవ్వనున్న ‘కాంతార’.. తెలుగు వెర్షన్ రేపు (అక్టోబర్ 15న) విడుదల కానుంది. ఇక అక్టోబర్ 21న మలయాళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందీ చిత్రం. మరి, శాండల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’, ‘777 చార్లీ’లాగే ‘కాంతార’ కూడా పాన్ ఇండియా హిట్‌గా నిలుస్తుందేమో చూడాలి.
Read more: ఆర్‌సీ15 మూవీ పిక్స్ లీక్.. షాక్‌లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ (RamCharan), డైరెక్టర్ శంకర్
Follow Us