కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్‌’ సినిమా సూపర్.. బ్లాక్‌బస్టర్‌‌ అని ట్వీట్ చేసిన ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్, కమల్ హాసన్ (Kamal Haasan) , ఉదయనిధి స్టాలిన్

కమల్‌హాసన్‌ (Kamal Haasan), విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘విక్రమ్‌’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ఈ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘విక్రమ్‌’ సినిమా చాలా బాగుందని, కమల్‌ హాసన్‌ను, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు స్టాలిన్.

విక్రమ్ సినిమాపై ఫస్ట్ రివ్యూ ఇస్తూ స్టాలిన్ ఇచ్చిన ట్వీట్‌పై కమల్‌ స్పందించాడు. స్టాలిన్‌ చేసిన ట్వీట్‌తో తమ విక్రమ్ సినిమాను మరింత మంది థియేటర్లకు వచ్చేలా చేశారని కమల్ అన్నాడు. తమిళనాడు రాష్ట్రంలో ‘విక్రమ్‌’ సినిమాను ఉదయ్‌ నిధి స్టాలిన్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కోసం స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా చూసిన అనంతరం స్టాలిన్ స్పందించాడు. ‘విక్రమ్‌’ సూపర్. కృతజ్ఞతలు కమల్‌హాసన్‌ సర్‌. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌తోపాటు మొత్తం చిత్ర బృందం అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. కచ్చితంగా సినిమా బ్లాక్‌బస్టర్‌ అని ట్వీట్‌ చేశాడు స్టాలిన్.

దీనికి కమల్‌హాసన్‌ స్పందిస్తూ ‘ప్రియమైన ఉదయ్‌ తంబి.. విక్రమ్‌ సినిమాపై మీ మొదటి స్పందనకు ధన్యవాదాలు. అభిమానిగా మీరేంటో మరోసారి చూపించారు. మీ అభిప్రాయం ఇతర సోదరులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది’ అని అన్నాడు కమల్. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నాడు.

ఏ పాత్రలోనైనా జీవించగల నటుడు..

ఏ పాత్ర చేసినా వైవిద్యం కోరుకునే నటుడు కమల్‌ హాసన్. కామెడీ, సీరియస్, సెంటిమెంట్‌ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి జీవించే నటుడిగా కమల్‌కు మంచి పేరుంది. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కథ, కథాంశం పరంగా అవి బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడుతున్నా.. ఆ సినిమాల్లో కూడా కమల్‌ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

దశావతారం సినిమాలో పది పాత్రలు పోషించి మెప్పించిన కమల్.. విశ్వరూపం 1, 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా కమల్‌ (Kamal Haasan) చేసిన సినిమా విక్రమ్. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్, పాటలు ఇప్పటికే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 

Read More: చిత్తుగ కుమ్మి.. ప‌చ్చడి చేస్తే చ‌చ్చిపోతావురా.. అంటూ మాస్ స్టెప్పులేసిన‌ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)

You May Also Like These