లోకనాయకుడు కమల్ హాసన్‌కు (Kamal Haasan) చాలా కాలం తర్వాత హిట్ వచ్చింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కమల్ స్టామినాను మరోసారి గుర్తుచేస్తోంది. విడుదలైన 2 రోజుల్లోనే రికార్డులు సృష్టిస్తోంది. దాదాపుగా రూ.100 కోట్లు వసూలు చేసి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో కమల్ హాసన్ మార్కెట్ మరింతగా పెరిగిందనే చెప్పవచ్చు. ఈ సినిమా కలెక్షన్లపై తాజాగా ఒక అప్‌డేట్ బయటకు వచ్చింది.
విక్రమ్ సినిమా రిలీజైన కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విక్రమ్ సినిమాలో కమల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
రెండు రోజుల్లోనే..
ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆదివారం ఒక్కరోజే విక్రమ్ సినిమా రూ.2 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తమిళం నుంచి తెలుగు డబ్బింగ్ అయిన ఒక సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ వసూళ్లు రాబట్టడం చాలా అరుదు. ఈ రేంజ్‌లో కలెక్షన్లు వసూలు చేస్తుండడం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు శుభపరిణామమనే చెప్పాలి. తమిళనాడులో ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం వీక్ డేస్‌లో ఎంతవరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan)తోపాటు స్టార్ యాక్టర్లు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. హీరో సూర్య గెస్ట్ రోల్ చేశాడు. విక్రమ్ సినిమా తెలుగు నెగెటివ్ రైట్స్‌ను నితిన్ సొంత నిర్మాణ సంస్ధ శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read More: కమల్ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్
Follow Us