‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగచైతన్య (Naga Chaitanya). కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతగానో బాధించిందని చెప్పారు. ఆ సంఘటన తర్వాత తాను థియేటర్లకు వెళ్లడం మానేశానని చెప్పారు చై. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో నాగచైతన్య ముచ్చటించారు.
‘నా మొదటి సినిమా ‘జోష్’ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో? నటుడిగా వాళ్లు నన్ను ఎలా స్వీకరిస్తున్నారో చూడాలనే ఉద్దేశంతో మొదటిరోజు థియేటర్‌కు వెళ్లా. సినిమా మొదలైనప్పుడు అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, సినిమా సగానికి వచ్చేసరికి ప్రేక్షకులు చాలామంది థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని బాధించింది. ఆ క్షణం ఎంతో బాధపడ్డాను
ఇప్పటికీ అదే నా మైండ్‌లో ఉంది
ప్రేక్షకుల్ని అలరించడానికే నేనిక్కడ ఉన్నా. కానీ అది నా వల్ల సాధ్యం కావడం లేదని అనిపించింది. ఆ అనుభవం నన్ను ఎంతగానో భయపెట్టింది. నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. ఆ తర్వాత నేనెప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన నా మైండ్‌లో నుంచి ఇప్పటివరకు పోలేదు. ఏదో ఒక రోజు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి.. ప్రేక్షకుల రియాక్షన్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను.
తాము నటించిన సినిమా విడుదలైన రోజు నటీనటులందరూ ఎంతో కంగారు పడుతుంటారు. అయినప్పటికీ, థియేటర్‌కు వెళ్లి ఫస్ట్ డే సినిమా చూస్తారు. కానీ, నేను అలా కాదు. నాకు కంగారు, భయం ఎక్కువ. కొన్ని సీన్లకు ప్రేక్షకులు నవ్వకపోతే? కొన్ని సీన్లకు ఏ విధంగానూ స్పందించకపోతే? అని ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటా’ అని నాగచైతన్య (Naga Chaitanya) వివరించారు.
Read More : Naga Chaitanya: నాపై వచ్చే రూమర్స్ ఫన్నీగా ఉన్నాయంటున్న నాగచైతన్య.. పట్టించుకోవడం మానేశానని వెల్లడి !
Follow Us