టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముందుగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శేష్.. గూఢచారి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. భిన్నంగా ఉన్న కథలనే సెలక్ట్ చేసుకుంటూ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
క్షణం, మేజర్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ సినిమా ద్వారా అడివి శేష్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
26/11 ముంబై బాంబు దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో అడివి శేష్.. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో శేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. శేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
వాటికి దూరంగా ఉంటా..
మీరు అందంగా ఉండటానికి రహస్యం ఏమిటి అని ప్రశ్నించారు. మందు, పొగ, డ్రగ్స్, నాన్ వెజ్ వంటి వాటికి దూరంగా ఉంటాను. సమయానికి నిద్రపోతాను అని సమాధానమిచ్చారు అడివి శేష్. మీ పెళ్లి కేన్సిల్ కావడానికి కారణం ఏమిటి అని అడుగగా.. ఇది చాలా కంప్లికేటెడ్ క్వశ్చన్ అంటూ సమాధానం చెప్పకుండా దాటవేశారు శేష్.
తెలుగు అమ్మాయితో భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేయాలని అమ్మానాన్నలు చూస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చిన అమ్మాయినైనా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటూ అడివి శేష్ (Adivi Sesh) చెప్పారు.
Follow Us