Brahmastra : బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ నటించిన 'బ్రహ్మాస్తం' చిత్రం సెప్టెంబర్ 9 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో స్పెషల్ పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు అయాన్ ముఖర్జీ విజువల్స్ వండర్‌గా ఈ సినిమాను చిత్రీకరించారు. 'బ్రహ్మాస్త్రం' సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసినా.. రిలీజ్ రోజు మాత్రం హైదరాబాద్‌లో ఈ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
'బ్రహ్మాస్త్రం' సినిమా రిలీజ్ రోజు అంటే.. సెప్టెంబర్ 9 తేదీన హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల నేపథ్యంలో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఇదే రోజు 'బ్రహ్మాస్త్రం' సినిమా రిలీజ్ కానుంది. వినాయక నిమజ్జన వేడుకల ఎఫెక్ట్ 'బ్రహ్మాస్త్రం' సినిమాపై పడవచ్చని మేకర్స్ భావిస్తున్నారు. సినిమా వసూళ్లపై తప్పకుండా ప్రభావం ఉండవచ్చని అంటున్నారు. ఈ సమస్యను ఎలా అధిగిస్తారో వేచి చూడాలి. ఇక వేళ సినిమా బాగుందనే టాక్ వస్తే తొలి రోజు తక్కువ కలెక్షన్ ఉన్నా.. ఆ తరువాత వచ్చే వీకెండ్‌లో భారీ కలెక్షన్ ఉంటుందని అంచనా.
భారీ బడ్జెట్ సినిమా
'బ్రహ్మాస్త్రం' (Brahmastra) మూడు భాగాలుగా తెరకెక్కుతుంది. 'బ్రహ్మాస్త్రం' మొదటి భాగం శివ పేరుతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాయి. బ్రహ్మాస్త్రం విడుదల తరువాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Read More: Brahmastra : 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుదల.. అంచనాలు మరింత పెంచిన విజువల్స్
Follow Us