కామిక్స్ అంటే పిల్లలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పిల్లలతోపాటు కొందరు పెద్దలు కూడా వీటిని తెగ చూస్తుంటారు. కామిక్స్‌ను ఆడియెన్స్‌కు కనెక్ట్ చేయడానికి వాయిస్ ఓవర్ చాలా ముఖ్యమని చెప్పాలి. అందుకే ప్రముఖ కామిక్ సంస్థలు తమ సిరీస్‌ల్లో వాయిస్ ఓవర్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాయి. ఇక డీసీ కామిక్స్‌లో ‘బ్యాట్‌మన్’కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
‘బ్యాట్‌మన్’ (Batman) క్యారెక్టర్‌ను ఆడియెన్స్‌కు అంతలా దగ్గర చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్ (Kevin Conroy) అనే చెప్పాలి. గంభీరమైన తన స్వరంతో ‘ఐ యామ్ వెన్‌జెన్స్.. ఐ యామ్ నైట్.. ఐ యామ్ బ్యాట్‌మన్’ అంటూ ఆయన చెప్పిన సంభాషణలు చరిత్రలో నిలిచిపోయాయి. తన వాయిస్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కెవిన్ ఇక లేరు.
‘బ్యాట్‌మన్’ యానిమేటెడ్ సిరీస్‌లో హీరో పాత్రకు వాయిస్ ఓవర్ అందించిన కెవిన్ కాన్రాయ్ గురువారం కన్నుమూశారు. ప్రేగు క్యాన్సర్‌తో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాన్రాయ్ కన్నుమూశారు. కెవిన్ కాన్రాయ్‌కు నివాళిగా సోషల్ మీడియాలో RIP Legend హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నడుస్తోంది. కెవిన్ కాన్రాయ్ మృతితో హాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.
ఇకపోతే, కామిక్స్ పోర్షన్ తర్వాత.. 1992–96 మధ్య ‘బ్యాట్‌మన్’ యానిమేటెడ్ సిరీస్‌లు విపరీతంగా జనాదరణను పొందాయి. అందులో 15 సినిమాలు, 400 టెలివిజన్ ఎపిసోడ్స్, 20కి పైగా వీడియో గేమ్స్, ‘బ్యాట్‌మన్ ఆర్ఖామ్ అండ్ ఇన్ జస్టిస్’ ఫ్రాంచైజీలకు కాన్రాయ్ వాయిస్ ఓవర్ అందించారు. తద్వారా ‘బ్యాట్ మన్’ క్యారెక్టర్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ తీసుకొచ్చారు. కాగా, న్యూయార్క్ వెస్ట్ బ్యూరీలో జన్మించిన కెవిన్ కెన్రాయ్.. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టారు. 1980 నుంచి టీవీ యాడ్స్ ద్వారా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, టీవీ సిరీస్‌ల్లోనూ మెరిశారు. అయితే ‘బ్యాట్‌మన్’ సిరీస్‌తో ఆయన పాపులారిటీ సంపాదించారు. హాలీవుడ్‌లో ‘గే’ సెలబ్రిటీగా ఆయనకు పేరుంది.
Follow Us