నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హీరోయిన్ సదా (Sadaa). తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. లంగా ఓణీతో కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్న సదా.. మాధవన్ హీరోగా వచ్చిన ప్రియసఖి సినిమాలో హాట్‌గా కనిపించి యూత్‌ను తనవైపు తిప్పుకున్నారు. పెళ్లిపై హీరోయిన్ సదా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమా తర్వాత ఎందుకోగానీ సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద వయసు ఉన్న హీరోలతో నటించిన కారణంగానే సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు హల్చల్ చేశాయి. హలో వరల్డ్ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సదా ఇటీవల మీడియాతో మాట్లాడారు.
అయిదుగురు విడిపోతున్నారు..
ఈ క్రమంలో తన పెళ్లి గురించి కామెంట్స్ చేశారు సదా. ప్రస్తుతం పదిమంది పెళ్లి చేసుకుంటే ఐదుగురు మాత్రమే కలిసి ఉంటున్నారు. మిగతా ఐదుగురు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్లు బతుకుతున్నారు. ఈ కామెంట్స్ పరోక్షంగా సమంత – చైతన్య విడాకులపై చేసినవేనని కొందరు అంటున్నారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చారు సదా.
‘నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నా లైఫ్‌ను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను.పార్టీలకు పబ్బులకు వెళ్లను. మందు తాగను. నా జీవితం నాకు నచ్చినట్లే బతకాలనుకుంటున్నాను. ఎవరో వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాలని అనుకోను. నాకు కాబోయే భర్త వెజిటేరియన్‌గా ఉండాలని కోరుకుంటున్నాను అని సదా (Sadaa) స్పష్టం చేశారు.
Follow Us