టాలెంట్ ఎక్కడ ఉన్నా.. హీరో ఎవరైనా.. సినిమా జోనర్ ఏదైనా.. కథ, కథనం బాగుంటే ప్రశంసిస్తుంటారు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). సాధారణ బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగారు ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ధోరణితో.. ఇప్పటికీ ఎంతో ఒద్దికగా ఉంటారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారం తెరకెక్కిన ‘రాకెట్రీ’ సినిమాపై రజినీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
రాకెట్రీ సినిమాకు మాధవన్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఆ సినిమా చూసిన రజినీకాంత్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మాధవన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించి మొదటి సినిమాతోనే తాను కూడా గొప్ప దర్శకులతో సమానమని మాధవన్ నిరూపించుకున్నారని రజినీకాంత్ అన్నారు. నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘రాకెట్రీ’ సినిమాను చూసి చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.
రజినీకాంత్ (Rajinikanth) ఏమన్నారంటే..
‘ప్రతి భారతీయుడు, ముఖ్యంగా యూత్ ‘రాకెట్రీ’ సినిమాను తప్పకుండా చూడాలి. మన దేశ అంతరిక్ష పరిశోధన అభివృద్ధికి పద్మభూషణ్ నంబి నారాయణన్ ఎంత కృషి చేశారు? ఎన్ని త్యాగాలు చేశారు? అనే విషయాలను సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి దర్శకులతో సమానమైన ప్రతిభ ఉన్న వాడినని మాధవన్ నిరూపించుకున్నారు.
ఇటువంటి అద్భుతమైన కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించిన మాధవన్‌కు అభినందనలు’ అని రజినీకాంత్ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటించి మెప్పించారు మాధవన్.
అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో నారాయణన్ చదువుకున్న రోజు నుంచి రాకెట్ సైన్స్ కోసం ఆయన చేసిన కృషి.. గూఢచర్యం కేసులో అరెస్టు కావడం.. నిరపరాధిగా బయటపడటం వరకు చాలా విషయాలను రాకెట్రీ సినిమాలో చూపించారు మాధవన్. జూలై 1వ తేదీన రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రజినీకాంత్ (Rajinikanth) వంటి ఎందరో ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసిస్తున్నారు.
Read More : కామెడీ ఇష్టపడే సినీ ప్రేమికులు మిస్ కాకూడని పది టాలీవుడ్ (Tollywood) సినిమాలు
Follow Us