తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 'రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్' సినిమాపై ప్రశంసలు కురింపిచారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా నటించిన మాధవన్ (Madhavan)ను సత్కరించారు. మాధవన్ స్వీయ దర్శకత్వంలో టైటిల్ రోల్ చేసిన చిత్రం 'రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్'. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలోని వాస్తవాలను మాధవన్ అద్భుతంగా తెరకెక్కించారని రజనీకాంత్ అన్నారు. ట్రై కలర్ ఫిలిమ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చర్స్, 27 ఇన్వెస్టిమెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
నిజాలను తెరకెక్కించారు - రజనీకాంత్
భారత్‌లో రాకెట్ ప్రయోగాల కోసం కృషి చేసిన నిజాయితీ గల ఇస్రో శాస్త్రవేత్తపై హీరో మాధవన్ సినిమా నిర్మించారు. 'రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్' పేరుతో ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలో తెరకెక్కించారు. హీరో సూర్య అతిథి పాత్రలో నటించారు. హిందీ వర్షన్‌లో సూర్య పాత్రలో షారూక్ ఖాన్ నటించారు. ఈ సినిమాను ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు.
రజనీకాంత్‌ను అభిమానిస్తూనే ఉంటాం - మాధవన్
మాధవన్ (Madhavan) సినిమా 'రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్' సక్సెస్ సాధించింది. దీంతో మాధవన్, ఇస్రో శాస్త్రవేత్త పద్మభూషణ్ నంబి నారాయణన్ రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. మాధవన్ గొప్ప సినిమా తీశారంటూ రజనీకాంత్ ప్రశంసించారు. మాధవన్‌ను శాలువాతో సత్కరించారు. మాధవన్ రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్నారు. రజనీకాంత్ తన సినిమాను మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మాధవన్ తెలిపారు.
రజనీకాంత్ ఆశీర్వాదం తనకు మరిచిపోలేని క్షణమంటూ మాధవన్ ట్వీట్ చేశారు. రజనీకాంత్ ప్రశంసలు తమలో చైతన్యం నింపాయన్నారు. రజనీకాంత్‌ను తాము ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటామన్నారు మాధవన్. 'రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్' సినిమాను ఇటీవల జరిగిన ప్రపంచ సినిమా వేడుకలైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్-2022 (Cannes Film Festival-2022)లో స్పెషల్ ప్రివ్యూ షోను ప్రదర్శించారు.
Read More: ఆస్కార్ ఆహ్వానం అందుకున్న రోలెక్స్ సర్... సౌత్ ఇండియన్ హీరో సూర్య (Suriya) కు అరుదైన గౌరవం !
Follow Us