ప్రభాస్‌తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కారణంగానే పొన్నియిన్ సెల్వన్ సాధ్యమైందని క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) చెప్పారు. ఒక కథను రెండు భాగాలుగా సక్సెస్‌ఫుల్‌గా ఎలా చెప్పాలో బాహుబలి ద్వారా రాజమౌళి చూపించారు.
రెండు భాగాలుగా తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా పీఎస్1 పేరుతో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి సహా చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనేది త్వరలోనే తెలుస్తుంది అని చెప్పారు మణిరత్నం.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష తదితర నటులు కీలకపాత్రల్లో నటించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని చోళ చోళ... అంటూ సాగే పాటని హైదరాబాద్‌లో శుక్రవారం విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ రచించిన ఈ పాటని.. మనో, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
పాట విడుదల సందర్భంగా అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఒక కళాత్మకమైన చరిత్ర. పొన్నియిన్ సెల్వన్ సినిమాకు పనిచేయడానికి ఎంతో పుణ్యం చేసుకున్నాను అనుకుంటాను. ఈ సినిమాలో పాటలు రాయడం సవాల్‌గా అనిపించినా, సంతోషంగా స్వీకరించి ఏడు పాటలు పూర్తి చేశా. దానికి కారణం మణిరత్నం ఇచ్చిన స్వేచ్ఛ అన్నారు.
ప్రత్యేక అనుబంధం..
‘మణిరత్నంతో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని విక్రమ్ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో ‘రావణ్’ తర్వాత పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించా. శంకర్, మణిరత్నం సినిమాల్లో నటించిన తర్వాతే రిటైర్ కావాలని ముందే అనుకున్నా. మణిరత్నం సినిమాలో మంచి పాత్రని చేయడం నాకు దక్కిన భాగ్యం’ అని చెప్పారు చియాన్ విక్రమ్.
సహాయ దర్శకుడిగా కెరీర్..
‘ఈ వేదిక నాకు చాలా ప్రత్యేకమైనది. మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలుపెట్టా. ఎంతో మంది చేయాలనుకున్న పాత్రని చేసే అవకాశం నాకు దక్కింది. ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనేది ఆసక్తికరం. 140 రోజుల్లో సినిమా రెండు భాగాలను పూర్తి చేశాం’ అని చెప్పారు హీరో కార్తి.
‘తమిళనాట జనపదమై పోయిన ఒక కథ ఈ పొన్నియిన్ సెల్వన్ సినిమా. దీన్ని 30 గంటల సినిమా చేయాలి. మణిరత్నం దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తూ తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్’ అని అన్నారు ప్రకాష్‌రాజ్.
‘25 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాకి మాటలు రాశాను. దానికి కారణం మణిరత్నం. పాతికేళ్ల కిందట ‘దళపతి’ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మణిరత్నం (Mani Ratnam) ఫోన్ చేసి పొన్నియిన్ సెల్వన్ సినిమాకి మాటలు రాయాలని కోరారు. జయరాం పోషించిన పాత్రకి కూడా డబ్బింగ్ చెప్పా. చాలా రకాలుగా గొప్ప అనుభవాలను ఇచ్చింది పొన్నియిన్ సెల్వన్ సినిమా’ అని తెలిపారు తనికెళ్ల భరణి.
Read More : Ponniyin Selvan (పొన్నియిన్ సెల్వన్ 1) : ఈ రోజే టీజర్ రిలీజ్.. ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు ఇవే
Follow Us