Advertisement

Raashi Khanna: సీరియల్ యాక్టర్ పాత్రలో అదరగొట్టేసిన.. 'పక్కా కమర్షియల్' మూవీలో హీరోయిన్ రాశీ ఖన్నా!

టాలీవుడ్ లో వరుస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్' (Pakka Commercial Movie) సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు మారుతి కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కించారు. గోపీచంద్‌కు జోడిగా ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా న‌టించారు.  ఇదే చిత్రంలో గోపీచంద్ న్యాయవాది పాత్ర‌లో వెండితెర‌పై క‌నువిందు చేశారు. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. 

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమాకు ముందుగా సాయి ప‌ల్ల‌విని కథానాయికగా అనుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో 'ఆక్సిజ‌న్‌'లో గోపీచంద్‌కు (Hero Gopichand) జోడిగా న‌టించిన రాశీ ఖ‌న్నాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. రాశీ ఖ‌న్నా ఈ చిత్రంలో సీరియల్ కథానాయికగా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

కామెడీ సీన్స్‌లో కూడా రాశీ (Raashi Khanna) తన మార్కు నటనను కనబరిచి ప్రేక్షకులను అలరించారు. సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించింది రాశీ. ఈమె క్యారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో.. మొన్న విడుదలైన ట్రైలర్‌తోనే అర్థమై ఉంటుంది. ఇక, ఈ సినిమాలో దీనికి మించి ఫన్ ఉంటుందంటున్నారు మేకర్స్. 

హీరో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి (Director Maruthi) అద్భుతంగా రాశారు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ అయింది. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్ కె ఎన్ సహ నిర్మాత‌గా వ్యవహరించారు. 

Read More: Pakka Commercial (పక్కా కమర్షియల్ రివ్యూ) : హీరో గోపీచంద్ కోసమే ఈ సినిమా చూడాలి.. అయినా ఏం మిస్ అయ్యిందంటే ?

Advertisement
You May Also Like These
Advertisement