Advertisement

Pakka Commercial: 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరంగా చిరంజీవి స్పీచ్..!

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీచంద్ తాజాగా 'పక్కా కమర్షియల్' (Pakka Commercial) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా కథానాయిక. 'పక్కా కమర్షియల్' చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. 

ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pakka Commercial Pre Release Event) హైదరాబాద్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా హీరో గోపీచంద్ తో తనకున్న అనుబంధాన్ని స్టేజిపై షేర్ చేసుకున్నారు చిరంజీవి. “గోపీచంద్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం మీకేమైనా తెలుసా? నేను ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ లో చేరినప్పుడు.. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గారు బీకాం ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. కొత్తగా వచ్చిన అబ్బాయెవరో రమ్మనండి అంటూ టి.కృష్ణ గారు నన్ను పిలిపించారు. నేను స్టూడెంట్ లీడర్ గా నిలబడుతున్నాను. నీ మద్దతు నాకు కావాలి. నీకెలాంటి సహకారం కావాలన్నా నన్నడుగు అంటూ, కృష్ణ గారు ఓ పెద్దన్నలా భరోసా ఇచ్చారు. ఆయనెప్పుడూ నాకు హీరోలా అనిపిస్తారు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అనంతరం హీరో గోపీచంద్‌ (Hero Gopichand) మాట్లాడుతూ… పట్టుదలతో ఇండస్ట్రీలో ఎదిగారు చిరంజీవి. ఆయన మాలాంటి ఎందరికో స్ఫూర్తినిస్తారు. తనకున్న టాలెంట్‌ కు దర్శకుడు మారుతి ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటాడు. రాశీ ఖన్నా ఈ చిత్రంలో తన కెరీర్‌ బెస్ట్‌ క్యారెక్టర్‌ చేసింది. మారుతి, బన్నీవాసు, యువీ వంశీ వీళ్ల చేతుల్లో సినిమా చేరితే సగం విజయం సాధించినట్లే. ఈ టీమ్‌ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది అని అన్నారు. 

ఇక, పక్కా కమర్షియల్ సినిమా కోసం హీరోయిన్ విషయంలో తాను జోక్యం చేసుకున్నానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుండబద్దలు కొట్టారు నిర్మాత అల్లు అరవింద్. మారుతి తనకు కథ చెప్తున్నప్పుడు.. కథానాయిక పాత్రలో తనకు రాశీ ఖన్నానే (Raashi Khanna) కనిపించందని.. ఆమెనే ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని తాను చెప్పానని అన్నారు. దీంతో ‘నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్..’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది రాశి ఖన్నా.

Read More: Chiranjeevi : చిరంజీవితో 'మారుతి' సినిమా .. పక్కా కమర్షియల్ (Pakka Commerical) దర్శకుడికి చిరు ప్రామిస్ !

Advertisement
You May Also Like These
Advertisement