మేజర్ (Major) సినిమా అద్భుతంగా ఉందంటూ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించారు. ముంబై దాడుల్లో ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్ ' సినిమా తెరకెక్కింది.
హీరో అడివి శేష్ మేజర్ పాత్రలో పరిపూర్ణంగా జీవించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో విడుదలైన 'మేజర్ ' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. కలెక్షన్ల పరంగా మేజర్ చిత్రం దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలను కొల్లగొడుతోంది.
మేజర్ (Major) సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ త్యాగాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ 'మేజర్ ' చిత్రాన్ని అందరూ చూడదగ్గ ఓ గొప్ప సినిమా అంటూ ప్రశంసించారు.
థ్యాంక్యూ లక్ష్మణ్ సర్ : అడివి శేష్
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ 'మేజర్' సినిమా గురించి ట్వీట్ చేయడంపై హీరో అడివి శేష్ సంతోషం వ్యక్తం చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ లాంటి క్రికెట్ దిగ్గజాలు తన నటనను ప్రశంసించడం గొప్ప విషయం అన్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వల్లే ఇదంతా సాధ్యమైందని ఎమోషనల్ అయ్యారు. 'వీవీఎస్ లక్ష్మణ్ సర్‌కు కృతజ్ఞతలు ' అంటూ అడివి శేష్ రిప్లై ఇచ్చారు.
మేజర్ ఓ గొప్ప దేశభక్తి చిత్రం
అడివి శేష్ అమెరికాలో పుట్టారు. అక్కడే పెరిగారు. ప్రముఖ తెలుగు రచయిత అడివి బాపిరాజు మనవడే అడివి శేష్. ఆయనపై తన తాత గారి ప్రేరణ ఎంతో ఉంది. విదేశాలలో ఉన్నప్పుడే, సినిమాలపై ఇష్టం పెంచుకున్న అడివి శేష్ హీరో అయ్యేందుకు ఇండియా వచ్చారు. శేష్‌కు దేశభక్తి ఎక్కవ. అందుకే తన సినిమా కథలను కూడా అదే ఇతివృత్తంతో ఎంచుకొనేవారు. మేజర్ (Major) సినిమాతో శేష్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప దేశభక్తి చిత్రాన్ని తీశారు.
Follow Us