‘జాతిరత్నాలు’ (Jathiratnalu) సినిమాతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). ఇక, ఉప్పెన సినిమాతో యువత గుండెల్లో చోటు దక్కించుకున్నారు హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty). లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డీ ఫర్ దోపిడీ, నేనొక్కడినే సినిమాల్లో నటించిన నవీన్ పోలిశెట్టి.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఆయన సినిమా విజయంతో స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇక వరుస సినిమా ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించారు కృతి. ఈ రెండు సినిమాలతో కృతి క్రేజ్ మరింత పెరిగింది. ఇక, ఆ తర్వాత నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇటీవల జరిగిన సైమా (SIIMA) అవార్డు వేడుకల్లో నవీన్ పోలిశెట్టి క్రిటిక్స్ కేటగిరీలో జాతిరత్నాలు సినిమాలోని నటనకుగాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా పోయినేడాది విడుదలై సూపర్‌హిట్ అయ్యింది.
అవార్డు వచ్చిన ఆనందంలో..
అల్లు అర్జున్, రణ్‌వీర్ సింగ్‌తోపాటు స్టార్ హీరోహీరోయిన్ల మధ్య అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని నవీన్ పోలిశెట్టి ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘సినిమా హీరో కావాలని గొప్ప కలలు కనడానికి మనం గొప్పవాళ్లం కాదు. చాలా పేదవాళ్లం’ అని చిన్నప్పుడు నాకెంతో మంది చెప్పేవారు. ఈరోజు ఆ అబ్బాయే ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. కష్టాలు, కన్నీళ్లు, ఆకలి రోజులు, నిద్రలేని రాత్రులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటే.. తప్పకుండా కలలు నిజమవుతాయి’ అని ట్వీట్‌లో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) పేర్కొన్నారు.
ఇక, ఉప్పెన సినిమాలోని నటనకు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డు అందుకున్నారు కృతిశెట్టి. ‘సైమా’ అవార్డు పొందడంపై కృతిశెట్టి కూడా ట్వీట్ చేశారు. ‘నా శ్రమను గుర్తించి, అవార్డు ఇచ్చి ప్రోత్సహించినందుకు థ్యాంక్యూ సైమా (SIIMA) . నాకు ఓటు వేసిన ప్రేక్షకులందరికీ థాంక్స్. మీరే నాకు స్ఫూర్తి. కలలు కనండి. వాటిని సాధించుకోవడానికి కష్టపడండి’ అని కృతిశెట్టి (Krithi Shetty) ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
Read More : విజయ్, అజిత్ గురించి ఒక్క మాటలో తేల్చేసిన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty).. ఇంతకీ ఏం చెప్పిందంటే?
Follow Us