Vikram Movie: 'విక్రమ్' సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన వాసంతి.. ఈమె కథ విన్నారా?

'విక్రమ్' మూవీ నటి వాసంతి (Vikram Movie Artist Vasanthi)

Vikram Movie: లోకనాయకుడు కమల్‌హాసన్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) ప్రధాన పాత్రల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. ఈ నెల 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించి.. ఆడియన్స్ కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పాత్ర ఏజెంట్ టీనా. 


ప్రస్తుతం ఈ నటీమణి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆమె ఒక్క సినిమాలోనూ నటించలేదు. చాలా తమిళ సినిమాలకు గ్రూప్ డాన్సర్ గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె దినేష్ మాస్టర్ దగ్గర కొరియో గ్రాఫర్ గా పనిచేస్తోంది. ఆమె బిహేవియర్ యాటిట్యూడ్ నచ్చి లోకేష్ కనగరాజ్ ఆమెకి విక్రమ్ చిత్రంలో టీనా (Agent Teena) లాంటి పవర్ ఫుల్ పాత్రనిచ్చి ఆమె కెరీర్ కే మంచి బ్రేక్ ఇచ్చాడు.

ఇందులో వాసంతి క్యారెక్టర్ రెండు రకాలుగా ఉంటుంది. మూవీ మొత్తం ఏమీ తెలియని పని మనిషిగా కనిపించే టీనా.. ప్రీ క్లైమాక్స్ లో మాత్రం తన అసలు రూపాన్ని బయటకు తీసుకువస్తుంది. ఆమె ఒక రా ఏజెంట్.. విక్రమ్ (Vikram Movie) ఫ్యామిలీ ప్రొటెక్టర్ గా పని చేస్తూ ఉంటుంది. విక్రం మనవడిని హత్య చేయడానికి వచ్చే విలన్ కి ఆమె చుక్కలు చూపిస్తుంది. అప్పటివరకు పనిమనుషుల చూసిన ఆమెను ఈ విధంగా విశ్వరూపం చూపించే సరికి ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతారు. 

సైలెంట్ గా ఇంకా ఏం జరుగుతుందని చూసే విధంగా టీనా పాత్రను తీర్చిదిద్దారు డైరెక్టర్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ విధంగా విక్రమ్ సినిమాలో టీనా పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూస్ తో యూబ్యూబ్ ఛానల్స్ నిండిపోతున్నాయి.  ఇప్పుడు టీనా పాత్రకి అభిమానులు పుట్టుకొచ్చారు. కొన్ని దశాబ్దాల వాసంతి కల నెరవేరింది. ప్రస్తుతం ఏజెంట్ టీనా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. 

ఏజెంట్ టీనా అసలు పేరు వాసంతి (Vasanthi). చెన్నైలో పుట్టి పెరిగింది. ఒక సామాన్య కుటుంబం నేపథ్యం ఆమెది. వృత్తిరీత్యా డాన్సర్ తమిళ మూవీస్ లో గ్రూప్ డాన్సర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. చాలా కష్టపడి అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారింది. 1992 నుంచే ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె 30 సంవత్సరాల ఇండస్ట్రీ ప్రయాణంలో అనేక నృత్య కొరియోగ్రాఫర్లతో పని చేసింది. ప్రస్తుతం ఆమె డాన్స్ కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ టీమ్ లో పని చేస్తోంది. 

Read more: విక్ర‌మ్ (Vikram) సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం నా అదృష్టం : క‌మ‌ల్ హాస‌న్

You May Also Like These