Brahmastra Trailer : బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) ట్రైల‌ర్‌లో చిరంజీవి వాయిస్ వింటే గూస్ బంప్స్ వ‌స్తాయి..

బాలీవుడ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌ుతున్న చిత్రం బ్రహ్మాస్త్రం (Brahmastra) నుంచి ఇటీవలే ఓ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాబ్ బ‌చ్చ‌న్, నాగార్జున్, మౌనిరాయ్‌లు లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న చిత్రం బ్ర‌హ్మాస్త్రం. అయాన్‌ ముఖర్జీ దర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. 

బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ ఎలా ఉందంటే

నీరు
గాలి
నిప్పు
కొన్ని వేల సంవ‌త్స‌రాలుగా
ఈ శ‌క్తుల‌న్నీ
కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి
ఈ క‌థ అస్త్రాల‌న్నిటికి అధిప‌తి అయిన బ్ర‌హ్మాస్త్రానిది.

అగ్ని అస్త్రం ర‌ణ‌బీర్ న‌టించిన శివ పాత్ర‌లో ఉంటుంది. శివను అగ్ని ద‌హించ‌లేదు. నంది అస్త్రం నాగార్జున‌లో ఉంటుంది. ఇక అంధ‌కారంలో ఉండి మౌని రాయ్ ఏం చేయ‌నుంది. బ్ర‌హ్మాస్త్రాన్ని (Brahmastra) వ‌శ‌ప‌రుచుకునేందుకు మౌని రాయ్ ఎలాంటి శ‌క్తిగా పోరాడుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

చీకటి రాణిగా మౌని రాయ్

అలాగే అస్త్రాల ప్ర‌పంచంతో శివ జీవితమనేది ముడిప‌డిందంటూ..అమితాబ్ బ‌చ్చ‌న్ చెప్పే డైలాగులు ఆస‌క్తికరంగా ఉన్నాయి. చేతిలో అస్త్రాలు ఉన్న వారు ఒక‌టి అవుతారా? అంద‌రూ క‌ల‌సి వాళ్ల అస్త్రాల‌తో చీక‌టి రాణి ఆగ‌డాల‌ను అడ్డుకోనున్నారా?

ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌ల‌తో బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ సాగుతోంది. ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, అనీష్‌ శెట్టి పాత్రలో నాగార్జున కనిపించనున్నారు.

బ్ర‌హ్మాస్త్రం (Brahmastra) ట్రైల‌ర్‌లో చిరంజీవి వాయిస్ వింటే గూస్ బంప్స్ వ‌స్తాయి. చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. ఇక ఈ సినిమాలో షారూక్ ఖాన్ కూడా ఓ సైంటిస్ట్‌ పాత్రలో క‌నిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సృష్టిని ర‌క్షించ‌డానికి ఎవ‌రు ఏ అస్త్రం వాడుతారో.. ప్ర‌పంచంలో పురాత‌న శ‌క్తుల‌ను ఎలా ర‌క్షిస్తారో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.  బ్ర‌హ్మాస్త్రం సినిమా సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read More:  Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాకి.. చిరంజీవికి కనెక్షన్ ఏమిటి ?

Credits: Twitter
You May Also Like These