Alia Bhatt: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. స్కానింగ్ ఫొటోలు వైరల్!

రణబీర్ కపూర్, అలియా భట్ (Ranbir Kapoor, Alia Bhatt)

Alia Bhatt: బాలీవుడ్ నటి అలియా భట్ శుభవార్త చెప్పారు. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలిపారు. తాజాగా అలియా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ల్లి కాబోతున్న‌ట్లు ఫోటోల‌ను పోస్ట్ చేసింది. హాస్పిట‌ల్‌లో కంప్యూటర్ మానిటర్ స్క్రీన్ ని చూపిస్తూ.. తన గర్భాన్ని చూసుకుంటూ సోనో గ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఆమె పక్కనే ఉన్న రణబీర్ కపూర్ స్క్రీన్ వైపు చూస్తుండడం ఫొటోలో కనిపిస్తోంది.  దీనితో పాటుగా బేబి సింహంతో రెండు సింహాలు అన్యోన్యంగా కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. 

బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ ఇటీవలే తన ప్రియుడు హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ని ఏప్రిల్ 14న ఘ‌నంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కూడా ప్లాన్ చేయలేదు. ఎవరి షూటింగ్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇద్దరూ కలిసి త్వరలోనే బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఆలియా పెళ్లి అయి ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. తాజాగా ఆలియా పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతోంది. వాణికపూర్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ప్రియాంక చోప్రా, టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్, మౌనీ రాయ్.. ఇలా చాలామంది ప్రముఖులు రణబీర్-అలియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల అలియా.. ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాడీ సినిమాలు చేసింది. బీటౌన్ లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన అలియా ఆర్ఆర్ఆర్ తో తెలుగువారికి చేరువయ్యారు. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ (Ramcharan) కు జోడీగా సీత పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం రణబీర్ తో కలిసి ఆమె చేసిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదలకు సిద్ధమైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదటి భాగం త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.  మరో 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హార్ట్ ఆఫ్ స్టోన్ తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.  

Read More: Brahmastra Trailer : బ్ర‌హ్మాస్త్రం ట్రైల‌ర్ రిలీజ్.. ఇందులో చిరంజీవి డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే

You May Also Like These