Sandeep Reddy Vanga: 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగాపై అనిల్ కపూర్ ( Anil Kapoor) ప్రశంసల జల్లు..!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) డైరెక్షన్లో నటించడం చాలా ఆనందంగా ఉంది. బాలీవుడ్ లో టాప్ రేంజుకు ఎదిగే సత్తా ఆయనకుంది. (Anil Kapoor)

Sandeep Reddy Vanga: టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండకు, సందీప్ రెడ్డి వంగాకు ఈ సినిమా ఊహించని క్రేజ్ తీసుకువచ్చింది. 2017 ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్‌'గా సందీప్ దర్శకత్వంలోనే వచ్చి భారీ హిట్ సాదించింది. అంతేకాదు మిగతా సౌత్ భాషలలో కూడా రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి వసూళ్ళను రాబట్టింది.

హిందీలో ‘కబీర్ సింగ్’ (Kabir Singh) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న సందీప్ వంగా.. తొలిసారిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి "యానిమల్" అనే భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. 

యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘యానిమల్’ చిత్రాన్ని గతేడాది ప్రారంభంలోనే ప్రకటించారు. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయింది. ఈ క్రమంలో 'యానిమల్' షూటింగ్ ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ (Anil Kapoor) మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం ఆయన ఒక పవర్ఫుల్ సబ్జెక్టును రెడీ చేసారని, బాలీవుడ్ లో టాప్ రేంజుకు ఎదిగే సత్తా ఆయనకుందని చెప్పుకొచ్చారు. దీంతో ఒక సౌత్ డైరెక్టర్ పై సీనియర్ బాలీవుడ్ హీరో ఈ రేంజ్ లో వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read More: హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపుతున్న 'మాస్టర్' (Master Movie) బ్యూటీ మాళవిక మోహనన్..!

Credits: Instagram
You May Also Like These