Luv Ranjan: రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటిస్తున్న 'లవ్ రంజన్' షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం..!

షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సెట్ మొత్తానికి మంటలు (Fire Accident in Shooting Set) వ్యాప్తించాయి.

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) జంటగా 'లవ్ రంజన్' (Luv Ranjan) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని చిత్రకూట్ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. తాజాగా ఈ షూటింగ్‌ సెట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ముంబైలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌ సెట్ లో తాజాగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  

షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సెట్ మొత్తానికి మంటలు (Fire Accident in Shooting Set) వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో మనీశ్ దేవాశీ అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. 

స్టూడియోలో ప్లాస్టిక్, థర్మాకోల్‌తో కూడిన సెట్‌ ఉండడంతో మంటలను ఆర్పడం కష్టంగా మారింది. సుమారు 12కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించడంతో ఎట్టకేలకు అవి అదుపులోకి వచ్చాయి. సెట్స్‌లో ప్రీ లైటింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. లవ్ రంజన్ (Luv Ranjan) సినిమాలోని ఒక పాటను ఇక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ అగ్ని ప్రమాద ఘటనలో (Fire Accident in Shooting Set)  మూవీ సిబ్బంది మనీశ్‌ దేవాశీ అనే వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు, సెలబ్రిటీలు ఎవరూ అక్కడ లేకపోవడంతో వారు సురక్షితంగానే ఉన్నారు. ఇక, ఈ అగ్నిప్రమాదం పై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Credits: Twitter
You May Also Like These