God Father Update: 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్, చిరంజీవితో (Chiranjeevi) కలిసి స్టెప్పులేయిస్తున్న ప్రభుదేవా!

''గాడ్ ఫాద‌ర్‌'లో ఓ పాట‌కు ప్ర‌భుదేవా (Prabhu deva) కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేస్తున్నారు.

'ఆచార్య' ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి 'గాడ్ ఫాద‌ర్‌' (Godfather). మ‌ల‌యాళ చిత్రం 'లూసిఫ‌ర్'కి తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కోలీవుడ్ డైరెక్ట‌ర్‌ మోహ‌న్ రాజా (Mohan Raja) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. చిరు 153వ సినిమాగా వ‌స్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'గాడ్ ఫాద‌ర్‌' సినిమాలో నయనతార (Nayanthara), సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ వీడియోలో అదిరిపోయే స్టైల్‌తో క‌నిపిస్తున్నాడు చిరు.

అయితే.. తాజాగా అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ మరో అప్‌డేట్ అందించాడు దర్శకుడు మోహ‌న్ రాజా. స్టార్ కొరియోగ్రాఫ‌ర్, దర్శకుడు అయిన ప్ర‌భుదేవా (Prabhu Deva)తో క‌లిసి ప‌నిచేస్తున్న విష‌యాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశాడు మోహ‌న్ రాజా. దీనికి సంబంధించిన షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. 

''గాడ్ ఫాద‌ర్‌'లో ఓ పాట‌కు ప్ర‌భుదేవా (Prabhudeva) కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేస్తున్నారు. నిన్న రాత్రి పాట షూటింగ్ మొద‌లైంది. లొకేష‌న్‌లో ప్ర‌భుదేవాతో క‌లిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ…ఇవాళ చాలా ప్ర‌త్యేక‌మైన రోజు. తొలిసారి నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమా తీసిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌, కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవాతో ప‌నిచేస్తున్నా.. గాడ్ ఫాద‌ర్ సెట్స్‌లో..' అంటూ ట్వీట్ చేశాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. 

మ‌రోవైపు షేకింగ్ లెగ్ విత్ భాయ్ (స‌ల్మాన్‌) అంటూ సాంగ్ షూట్‌లో తీసిన స్టిల్‌ను చిరంజీవి సైతం ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో నటుడు సునీల్, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannath), కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కాగా, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Read More: 'గాడ్ ఫాదర్' మూవీ నుంచి సల్మాన్, చిరంజీవి సీన్ లీక్.. ఫొటో వైరల్ !

Credits: Twitter
You May Also Like These