Avatar: The Way of Water: 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' హాలీడే సీజన్‌లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమానే కాకుండా ఊహకందని విజువల్స్ ఎఫెక్ట్ 'అవతార్ 2' సొంతం. 'అవతార్' సినిమాతో పోల్చి చూస్తే 'అవతార్ 2' సినిమా పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' సినిమా సవాళ్లపై పింక్ విల్లా ప్రత్యేక కథనం..
సినిమాపై భారీ అంచనాలు
'అవతార్' సినిమా రిలీజ్ అయిన 13 ఏళ్లకు 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' రిలీజ్ అయింది. 'అవతార్ 2' ముందే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 'అవతార్' సినిమా చూసిన ప్రేక్షకులు సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెంచుకున్నారు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రేక్షకుల అంచనాలకు మించి వినోదం అందించారు. 'అవతార్ 2' సినిమాపై ద్రవ్యోల్బణం, కోవిడ్ వంటి కారణాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి.
కళ్ళద్దాలతో చూడాల్సిందేనా!
జేమ్స్ కామెరాన్ పండోరా సాహసాలకు విజువల్ ఎఫెక్ట్ జోడించారు. 'అవతార్ 2' సినిమా ట్రైలర్ చూస్తేనే గొప్ప అనుభూతి కలిగింది. ఇక సినిమాలో విజువల్స్ చూసి థ్రిల్ అవ్వాలంటే 3డీ కోసం కళ్ళజోడులు పెట్టుకోవాల్సిందే. అప్పుడే సినిమాను మరింత ఎంజాయ్ చేయగలరు. 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' సినిమాను ఐ గ్లాసెస్ ధరించి చూస్తే బొమ్మ అదుర్స్ అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా RealD 3D, Dolby Cinema, IMAX, IMAX 3D ఫార్మాట్లలో విడుదలైంది.
జనాదరణ పొందిన సినిమా..
'అవతార్' సినిమా విపరీతమైన జనాదారణ పొందింది. కోవిడ్ తరువాత కూడా 'అవతార్ 2 'సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. 'అవతార్' కంటే 'అవతార్ 2' సినిమా టికెట్ రేటు కూడా పెరిగింది. కోవిడ్ తరువాత పలు భారీ బడ్జెట్ సినిమాలు నష్టాలను చవిచూశాయి. కానీ 'అవతార్ 2' సినిమా థియేటర్‌కు వెళ్లి చూసేలా కామెరాన్ ప్లాన్ చేశారు. టెక్నాలజీతో అద్భుతమైన మ్యాజిక్ చేశాడు. అందుకనే 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
అవతార్ 2కు సక్సెస్ అవసరం!
ప్రతి సినిమాపై ఒత్తిడి ఉండటం సహజం. కానీ 'అవతార్ - ద వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water) సినిమా సక్సెస్‌పై సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అవతార్ 2 కోసం వాడిన 3డీ మెగా ఈవెంట్ పనితీరు జనాలకు నచ్చకపోతే పరిస్థితి మరోలా ఉండేది. భవిష్యత్తులో సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. థియేటర్ అనుభవం భవిష్యత్తులో మనుగడలో ఉండటం కష్టమయ్యే అవకాశం లేకపోలేదు.
ఈ సినిమా కోసం జేమ్స కామెరాన్ కష్టం ఊరికే పోలేదు. అద్భుతమైన ఓ వింత లోకంలో జరిగిన కథ అందరినీ ఆకట్టుకుంది. మిలియన్ బడ్జెట్‌తో కూడిన టెక్నాలజీ సినిమాలు భవిష్యత్తులో రూపొందించాలంటే 'అవతార్ 2' కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన అవసరం ఉంది.
సీక్వెల్ సినిమాలు సంచలనాత్మక విజయాలు సాధించడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ 'అవతార్', 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' సినిమాల సక్సెస్ జేమ్స్ కామెరాన్‌తోనే సాధ్యమైంది. 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' సినిమా అన్ని సవాళ్లను ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద ప్రపంచంలోనే బ్లాక్ బాస్టర్ హిట్ సాధించే దిశగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ఎలాంటి ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుందో చూడాలి.
Read More: Avatar: The Way of Water: జేమ్స్ కామెరాన్‌కు 'అవతార్ 2' చిత్రం ఎందుకంత ప్రత్యేకమైందో తెలుసా!
Follow Us