తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ (Allu Arjun) స్టైలిష్ స్టార్‌గా సుపరిచితులు. ప్రస్తుతం ఆయన పంజాబ్ పర్యటనలో ఉన్నారు. గురువారం (సెప్టెంబర్ 29) నాడు తన సతీమణి స్నేహతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన వాఘా బోర్డర్‌కు వెళ్లారు.
అంతకుముందే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అల్లు అర్జున్ సందర్శించారు. ఆ దేవాలయంలో దంపతులు ఇరువురూ ప్రార్థనలు చేశారు.
సెప్టెంబర్ 29వ తేదిన అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహ పుట్టినరోజు కావడం గమనార్హం. ఆ రోజున ఆమె సిక్కుల ఆలయంలో గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత అల్లు అర్జున్ తన కుటుంబం ఆధ్వర్యంలోనే స్నేహ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వైరల్ అయిన వీడియోలు
ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) కేక్ కట్ చేస్తుండగా తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బర్త్ డే ఈవెంట్ పూర్తయ్యాక, అమృత్‌సర్ నుంచి బన్నీ కుటుంబం నేరుగా వాఘా సరిహద్దుకి వెళ్లింది.
అక్కడ దంపతులిద్దరూ తమ పిల్లలతో కలిసి బీఎస్ఎఫ్ జవాన్లతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
"పుష్ప" క్రేజ్‌తో పాన్ ఇండియా వరకు..
"పుష్ప" చిత్రంతో పాన్ ఇండియా సెలబ్రిటీగా మారిపోయిన అల్లు అర్జున్‌కు (Allu Arjun) ఇప్పుడు ఉత్తరాదిలో కూడా అభిమానుల సంఖ్య పెరిగింది. గతంలో బన్నీ మలయాళంలో కూడా స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే బన్నీ నటించిన "అలవైకుంఠాపురం" చిత్రం హిందీలో డబ్ చేయబడి, థించక్ అనే టీవీ ఛానల్‌లో రికార్డు స్థాయిలో టీఆర్పీని నమోదు చేసింది.
Follow Us