Macherla Niyojakavargam: ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుంచి 'అదిరిందే పసిగుండే' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుంచి ఫుల్ వీడియో సాంగ్ రిలీజైన పోస్టర్ (Poster Released From Macherla Niyojakavargam Movie)

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రాధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ (Macherla Niyojakavargam). బ్యూటీఫుల్‌ హీరోయిన్స్‌ కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. 

ప్రేమ క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే నితిన్ (Hero Nithiin) ఈ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ రోల్‌ను పోషించాడు. ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేయనుంది. మాచర్ల దమ్కీ 26న, థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మామిడాల తిరుపతి డైలాగ్స్, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. 

ఇప్ప‌టికే ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’  చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌ యూనిట్ వ‌రుస అప్‌డేట్‌ల‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మేక‌ర్స్‌ ఈ సినిమాలోని థ‌ర్డ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ‘అదిరింది’ (Adirinde Full Video Song) అంటూ సాగే మెలోడియ‌స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుద‌ల చేశారు. 

'అదిరిందే పసిగుండే' అంటూ సాగే ఈ పాటలో నితిన్‌, కృతీశెట్టి (Krithi Shetty) తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మహతి స్వర సాగర్‌ మ్యూజిక్‌ అందించగా పాటను సంజిత్‌ హెగ్డే ఆలపించారు. ఇక, ఈ పాటలో నితిన్, కృతి శెట్టిల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ గా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం క్యాచీగా ఉంది. దీంతో 'మాచర్ల..' ఆల్బమ్‌లో మరో అదిరిపోయే చార్ట్‌బస్టర్ సాంగ్ చేరిందని ఈ పాట చూస్తే అర్ధమవుతోంది.

Read More: "రారా రెడ్డి" సాంగ్‌ రిలీజ్ కార్యక్రమంలో సందడి చేసిన నితిన్, అంజలి, కృతి శెట్టి..!

You May Also Like These