Anjali : 'అంజలి' బ‌ర్త్ డే స్పెషల్ స్టోరి : దక్షిణాది సినీ పరిశ్రమలో.. మన 'రాజోలు' అమ్మాయి రూటే సెపరేటు !

అంజ‌లి (Anjali) తెలుగు అమ్మాయిగా త‌మిళ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు.

టాలీవుడ్‌లో హీరోయిన్ అంజ‌లి (Anjali) న‌ట‌న‌కు ఒక ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్ర‌ల్లోనైనా అంజ‌లి ఒదిగిపోతారు. సీరియ‌స్, కామెడీ, యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఆమె వినోదం పంచారు. షాపింగ్ మాల్, కాట్రాదు తమిళ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ లాంటి సినిమాలలోని, త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో సినీ ప్రేక్ష‌కుల హృదయాల్లో నిలిచిపోయారు. నటి అంజ‌లి పుట్టిన రోజు సంద‌ర్భంగా పింక్ విల్లా స్పెష‌ల్ స్టోరి మీకోసం..!

అంజ‌లి (Anjali) అస‌లు పేరు బాల త్రిపుర సుంద‌రి. అంజ‌లి 1986 జూన్ 16న తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులో జ‌న్మించారు. టెన్త్ వ‌ర‌కు అంజ‌లి త‌న సొంతూరులోనే చ‌దువుకున్నారు. ఆ త‌ర్వాత త‌న తండ్రి ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్లారు. డిగ్రీ చ‌దువుతూనే అంజ‌లి షార్ట్ ఫిలిమ్స్ చేసేవారు. 

సినిమా ఎంట్రీ

అంజ‌లి(Anjali)కి సినిమా హీరోయిన్ కావాల‌నే చిన్నప్పటి నుండీ డ్రీమ్ ఉండేది. డిగ్రీ చ‌దివే రోజుల్లో యాక్టింగ్‌పై కూడా దృష్టి పెట్టారు. అంజ‌లి న‌టించిన ఓ షార్ట్ ఫిలిమ్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఓ తమిళ చిత్రంలో ఛాన్స్ రావడంతో, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పేరు "కాట్రాదు తమిళ్". ఈ చిత్రంలో హీరో జీవాకు జోడిగా అంజలి న‌టించారు. తెలుగులో ఆ సినిమా "డేర్" అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. 

వెంక‌టేష్‌ కు జోడీగా అంజలి
2006లో 'ఫోటో' సినిమాతో అంజ‌లి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప్రేమ‌లేఖ రాశా' అనే మరో చిత్రంలో కూడా న‌టించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ 'షాపింగ్ మాల్' సినిమా అంజ‌లి కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచింది. 'షాపింగ్ మాల్' మూవీలో అంజ‌లి న‌ట‌న చూసిన ద‌ర్శ‌కుడు 'మురుగదాస్' తనకు 'జర్నీ' చిత్రంలో అవ‌కాశం ఇచ్చారు.

ఇక 2013లో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' చిత్రం తెలుగులో అంజ‌లికి మంచి హిట్ ఇచ్చింది. వెంక‌టేష్‌కు జోడీగా ఈ సినిమాలో నటించిన అంజ‌లి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.

'బ‌లుపు' సినిమాలో ర‌వితేజ్ స‌ర‌స‌న అంజలి న‌టించారు. ఆ సినిమా ఆమె కెరీర్‌కు బాగానే హెల్ప్ అయ్యింది. తెలుగమ్మాయి అంజలికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.  2014లో 'గీతాంజ‌లి' సినిమాలో  ద్విపాత్రాభినయం చేసిన అంజ‌లి.. తన న‌ట‌న‌కు గాను బెస్ట్ యాక్ట‌ర్‌గా నంది అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా 'వ‌కీల్ సాబ్‌'లో కూడా మంచి న‌ట‌నను క‌న‌బ‌ర్చారు. 

అవార్డులు
అంజ‌లి (Anjali)న‌ట‌న‌కు ఎన్నో అవార్డులు వ‌రించాయి.  కాట్రాదు త‌మిళ్, అంగడి తెరు.. ఈ రెండు త‌మిళ సినిమాల్లో న‌టించిన అంజ‌లి.. ఆ చిత్రాల్లో న‌టించి మెప్పించినందుకు ఫిలిమ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు.  తెలుగులో గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. సినిమాల‌కు గాను ప్రతిష్టాత్మక నంది అవార్డు అంజ‌లిని వ‌రించింది.

రామ్ చ‌ర‌ణ్ సినిమాలో అంజ‌లి!
ప్ర‌స్తుతం అంజ‌లి (Anjali) 'బైరాగి' అనే క‌న్న‌డ సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా,  'నాయ‌ట్టు' అనే మ‌ళ‌యాళం సినిమా రీమేక్‌లో కూడా అంజ‌లి న‌టిస్తున్నారు. 

అంజ‌లి తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా, ఇతర భాషా చిత్రాలలో కూడా తన సత్తా చాటారు. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో కూడా నటిస్తూ, అభిమానులను సొంతం చేసుకున్నారు. అంజలి మరిన్ని మంచి చిత్రాలలో నటించాలని.. మరిన్ని అవార్డులు, రివార్డులు ఆమెను వరించాలని పింక్ విల్లా కోరుకుంటుంది.

Read More: Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమాలో.. విలన్‌గా ఒకప్పటి యంగ్ హీరోయిన్ !

హ్యాపీ బ‌ర్త్ డే అంజ‌లి
పింక్ విల్లా
Credits: Twitter
You May Also Like These