Zee Telugu Kutumbam Awards 2022 Kiraak Party : తెలుగు ప్రేక్షకులకు వినూత్న రీతిలో వినోదం అందించే ఛానల్ "జీ తెలుగు" (Zee Telugu). ఈ ఛానల్ సీరియల్స్‌తో పాటు డాన్స్, పాటల షోలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన సినిమాలను ప్రసారం చేస్తూ వినోదం అందించడంలో "తగ్గేదేలే" అంటూ ముందుకు సాగిపోతోంది.
సంక్రాంతి.. దసరా.. దీపావళి.. ఇలా ప్రతీ పండుగకు వినూత్నమైన కార్యక్రమాలను అందిస్తూ, పండుగ మజా ఏంటో తెలిసేలా చేస్తోంది. ఇదే క్రమంలో ఇటీవలే "జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022" షోను సరి కొత్తగా ప్లాన్ చేసింది.
ఈ అవార్డుల గ్రాండ్ ప్రీ-ఈవెంట్ పార్టీని "కిరాక్ పార్టీ" పేరుతో నిర్వహించింది. ఈ ఈవెంట్ అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటలకు "జీ తెలుగు"లో ప్రసారం కానుంది.
తొలిసారిగా జీ తెలుగులో
తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తొలిసారిగా "జీ తెలుగు" ఛానల్ ఓ వైవిధ్యమైన షోకి నాంది పలికింది. ‘కిరాక్ పార్టీ‘ పేరుతో గ్రాండ్ ప్రీ-ఈవెంట్ పార్టీని హోస్ట్ చేసింది. ప్రేక్షకులకు మరింత వినోదం అందించేలా "జీ తెలుగు" ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో ఎందరో సినీ నటులు, సెలబ్రిటీలు సందడి చేశారు. ఆట పాటలతో హుషారెత్తించారు. శ్రీముఖి, సుధీర్‌లు వ్యాఖ్యాతలుగా "కిరాక్ పార్టీ"ని ఓ రేంజ్‌లో అదరగొట్టారు.
అత్తా కోడళ్లతో పోసాని హంగామా
శ్రీముఖి, సుధీర్, రోహిణి, సద్దాం, బాబా భాస్కర్ తదితరులు చేసే అల్లరి ఈ కిరాక్ పార్టీలో హైలెట్‌గా నిలిచింది. ఇక నటుడు పోసాని కృష్ణమురళి ‘జీ తెలుగు’ అత్తాకోడళ్లతో కలిసి చేసిన "బతుకు జట్కా బండి" స్పూఫ్ మంచి హాస్యాన్ని పండించింది. ఇక సీరియల్ హీరో హీరోయిన్లు చేసిన డాన్సులు, కామెడీ షోలు సరదాగా సాగాయి. ఇక "జీ సరిగమప" సింగర్స్ యశస్వి కొండేపూడి, ప్రణవ్ కౌశిక్ జంటగా లైవ్ బ్యాండ్‌తో పాడిన పాటలు కచ్చితంగా "జీ తెలుగు" ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సుధీర్ డాన్సులు
ఈ ఈవెంట్‌లో రోహిణి, సాయి కిరణ్, గోకుల్, మరియు ఆకర్ష్ కూడా తమ పాటలతో హుషారెత్తించారు. అలాగే ఈ కిరాక్ పార్టీలో ‘పడమటి సంధ్యారాగం’ ,‘అమ్మాయిగారు’ ధారావాహికలలో నటించిన నటీనటులను కూడా సభికులకు పరిచయం చేశారు.
ఇక బ్లాక్ బాస్టర్ హిట్ పాటలకు సుధీర్ చేసిన డాన్సులు అదిరిపోయాయి. ఇంకా ఇలాంటి ఎన్నో వినోదభరితమైన సన్నివేశాలు కిరాక్ పార్టీలో జనాలను అలరించాయి. జీ తెలుగులో అక్టోబర్ 9 సాయంత్రం ప్రసారమయ్యే "కిరాక్ పార్టీ" షోని మీరు మిస్ కాకుండా చూసేందుకు సిద్దంగా ఉండండి.
Follow Us